యాక్షన్ థ్రిల్లర్ “V”మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న సుధీర్ బాబు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “పలాస 1978″మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు కథానాయకుడిగా “శ్రీదేవి సోడా సెంటర్ “మూవీ తెరకెక్కుతుంది.మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో సుధీర్ బాబు , బ్లాక్ బస్టర్”ఉప్పెన “మూవీ ఫేమ్ కృతిశెట్టి జంటగా “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి “మూవీ రూపొందుతుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో సుధీర్ బాబు ఫిల్మ్ డైరెక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. దర్శకుడు ఇంద్రగంటి , హీరో సుధీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన “సమ్మోహనం “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























