యాక్టర్ , డైరెక్టర్ , స్క్రీన్ రైటర్ అడివి శేష్ హీరోగా సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “జూలై 2 వ తేదీ రిలీజ్ కానుంది. శోభిత ధూళిపాళ , సాయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులమీదుగా “మేజర్ “మూవీ టీజర్ ఏప్రిల్ 12 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తెలుగు , హిందీ , మలయాళ భాషల టీజర్ కు విశేష ప్రేక్షకాదరణ లభించింది. మూడు భాషల టీజర్ యూట్యూబ్ లో 32 మిలియన్స్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో అడివి శేష్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియజేశారు. సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు “మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అడివి శేష్ “మేజర్ “మూవీ తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ తో అడివి శేష్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: