
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 43


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ?

తమన్నా కరోనా సందేశం

బుర్రి పాలెం గ్రామ ప్రజలకు అండగా మహేష్ బాబు

ఈసారి హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్..!

'RC15'..క్లారిటీ కావాలంటున్న చరణ్..!

"అఖండ " లో శ్రీకాంత్ , పూర్ణ స్పెషల్ ఎట్రాక్షన్

థియేటర్స్ లోనే "ఖిలాడి "

టాలీవుడ్ 'ట్విట్టర్ స్టార్స్'

మూడు సినిమాలతో నాగచైతన్య సందడి

కరోనా కారణంగా వాయిదా పడిన టాలీవుడ్ మూవీస్

శృతి హాసన్ సూపర్ లుక్

'లూసిఫర్' రీమేక్ కోసం చిరు డేట్సు

ఫరియా అబ్దుల్లా బ్లాక్ &వైట్ ఫొటో

అనసూయకు అభిమానుల బర్త్ డే విషెస్

అందరూ జాగ్రత్తగా ఉండండి - చిరంజీవి

కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు తలైవా విరాళం
గత ఏడాది మార్చి నుండి మన దేశంలో మొదలైన కరోనా ప్రభావం ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. జనవరి నుండి కాస్త కరోనా ప్రభావం తగ్గుతుంది సాధారణ పరిస్థితులు వస్తున్నాయి అనుకునేలోపు మళ్లీ సెకండ్ వేవ్ అంటూ కరోనా మహమ్మారి మరోసారి జూలు విడిచింది. ఇక గతంలోలాగానే సినీ పరిశ్రమ పై కూడా ఈసారి తన ప్రభావం చూపిస్తుంది. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మృత్యువాత పట్టారు. ఆఖరికి యంగ్ గా ఉన్న సెలబ్రిటీలు కూడా చనిపోతుండటం గమనార్హం. ఫస్ట్ వేవ్ లో ఆర్థిక పరిస్థితుల వల్ల నిత్యవసరాలకు ఇబ్బంది పడగా.. ఇప్పుడు ఆక్సిజన్ ను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో సెలబ్రిటీల నుండి సామాన్యులదాకా అందరూ ముందుకొచ్చి ఎవరికి తోచినంత…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ను తెరకెక్కించే సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొరటాల , ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన "జనతా గ్యారేజ్ "మూవీ ఘనవిజయం సాధించింది.

"ముగ్గురు మొనగాళ్లు " ఫస్ట్ లుక్ రిలీజ్
చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వం లోశ్రీనివాస రెడ్డి , దీక్షిత్ శెట్టి , వెన్నెల రామారావు ప్రధాన పాత్రలలో“ముగ్గురు మొనగాళ్లు” మూవీ తెరకెక్కుతుంది. కమెడియన్ గా ప్రేక్షకులను అలరిస్తూనే శ్రీనివాస రెడ్డి "గీతాంజలి", ‘జయమ్ము నిశ్చయమ్మురా"వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో కథానాయకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

తమన్నా కరోనా సందేశం
పలు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ తమన్నా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్"మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. సినీ సెలబ్రిటీస్ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు. కరోనా బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు తమన్నా ఒక సందేశం ఇచ్చారు.

బుర్రి పాలెం గ్రామ ప్రజలకు అండగా మహేష్ బాబు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి దారుణంగా ఉంది. మొదటి దశతో పోల్చితే రెండో దశ కరోనా అత్యంత ప్రమాదకరంగా మారింది. సరైన వైద్యసౌకర్యాలు అందక ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు . ఈ నేపథ్యంలో ప్రజలకు సహాయం అందించేందుకు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. కొందరు కరోనా బాధితుల సహాయం కోసం ఆర్థిక సహాయం అందిస్తుండగా, మరికొందరు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈసారి హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్..!
మొదటిసినిమాతోనే సాలిడ్ ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే ఎంతోమంది హీరోలు రాగా.. వైష్ణవ్ తేజ్ మాత్రం మొదటిసినిమాతోనే మెగా యంగ్ హీరోలందరికీ పోటీగా నిలిస్తున్నాడు. ఇక ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన వైష్ణవ్ ప్రస్తుతం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇప్పటికే పలు ప్రాజెక్టులను లైన్ లో కూడా పెట్టాడు. ప్రస్తుతం ఇప్పుడు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా, అలాగే నాగార్జున నిర్మాతగా మరో సినిమా చేయడానికి వైష్ణవ్ తేజ్ ఓకే చెప్పేశాడు.

'RC15'..క్లారిటీ కావాలంటున్న చరణ్..!
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ సినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. కానీ చూడబోతే ఈసినిమా అప్పుడే సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని కనిపిస్తుంది. ఎందుకంటే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే మధ్యలో ఇండియన్ 2 సినిమా వివాదం ఒక కొలిక్కి రావాల్సిందే. అది ఇప్పుడప్పుడే తేలేలా కూడా కనిపించడంలేదు. ఈనేపథ్యంలోనే రామ్ చరణ్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మెగాపవర్ స్టార్ ఇప్పటికే రెండేళ్ళకు పైగా ఆర్.ఆర్.ఆర్ కోసమే కేటాయించారు. ఇప్పటికీ ఈసినిమా షూటింగ్ అవ్వలేదు.. అది అవ్వడానికి ఇంకా టైమ్ పడుతుంది..ఎలాగూ చివరిశలో ఉంది కాబట్టి తొందరగానే పూర్తవుతుంది.

"అఖండ " లో శ్రీకాంత్ , పూర్ణ స్పెషల్ ఎట్రాక్షన్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న "అఖండ " మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. “అఖండ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

థియేటర్స్ లోనే "ఖిలాడి "
మాస్ మహారాజా రవితేజ హీరోగా సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదాపడింది. ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై .రూపొందుతున్న ఈ మూవీ లో హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు . ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

టాలీవుడ్ 'ట్విట్టర్ స్టార్స్'
ఒక సినిమా ప్రమోషన్ కు సోషల్ మీడియా ఎంత ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడంటే ఇలాంటి మాద్యమాల అవసరం ఏం ఉండేది కాదు. కానీ టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఫోన్ లోనే ప్రపంచాన్ని చూసేస్తున్నారు. సోషల్ మీడియాలోనే అన్నీ అప్ డేట్స్ తెలుసుకుంటారు. అందుకే ఒకప్పుడు కాస్త సోషల్ మీడియాకు దూరంగా ఉండే మన హీరోలు కూడా ఇప్పుడు ట్విట్టర్, ఇన్స్టా ఖాతాల్లో యాక్టీవ్ అవుతున్నారు. తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇక మన హీరోలను ఫాలో అయ్యే ఫ్యాన్స్ కూడా మిలియన్స్ లో ఉన్నారు. అంతేకాదు ఇక్కడ కూడా ఎవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు.. ఎన్ని మిలియన్స్ మంది ఉన్నారు…

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' - బోల్డ్ పాత్రలో సామ్..షాకవుతారు
సమంత యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా సరే తను అలా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది. అల్లరి పాత్ర అయినా.. ఎమోషనల్ పాత్ర అయినా.. రంగస్థలంలోని డీగ్లామర్ పాత్రలో అయినా.. మరీ ముఖ్యంగా సూపర్ డీలక్స్ లో లాంటి బోల్డ్ పాత్ర అయినా సరే సమంత చాలా ఈజ్ తో నటించగలిగే సత్తా ఉన్న నటి. అందుకే అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగి ఇప్పటికే అదే ఫామ్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉంది.

మూడు సినిమాలతో నాగచైతన్య సందడి
2021 సంవత్సరం లో హీరో నాగచైతన్య మూడు సినిమాలతో సందడి చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన "లవ్ స్టోరీ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "థ్యాంక్ యు " మూవీ లో నటిస్తున్నారు. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా ఇటలీ లో జరిగిన విషయం తెలిసిందే.

కరోనా కారణంగా వాయిదా పడిన టాలీవుడ్ మూవీస్
కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి , రిలీజ్ లు ఆగిపోయి , థియేటర్స్ మూతబడి చిత్ర పరిశ్రమ పలు విధాలా నష్టపోయిన విషయం తెలిసిందే. 9నెలల తరువాత అంతా సక్రమం గా జరుగుతున్న తరుణం లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో తిరిగి చిత్ర పరిశ్రమకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి రూపొందించిన సినిమాలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడ్డాయి. చిన్న సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లలో రిలీజ్ అవుతున్నా పలువురు నిర్మాతలు తమ మూవీస్ ను థియేటర్స్ లలో రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

శృతి హాసన్ సూపర్ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి హాసన్ తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా రూపొందిన "క్రాక్ ", "వకీల్ సాబ్ "మూవీస్ ఘనవిజయం సాధించాయి. విజయోత్సాహం లో ఉన్న శృతి ,బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న "సలార్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "సలార్ "మూవీ లో శృతి ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా నటిస్తున్నారు.

'లూసిఫర్' రీమేక్ కోసం చిరు డేట్సు
మెగాస్టార్ చిరు లిస్ట్ లో ఇప్పుడు పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఆయన లైన్ లో పెట్టిన సినిమాలను కూడా ఎలాగైనా పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ఎలాగూ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే ఈసినిమా షూటింగ్ అయిపోయి ఉండేది. ఇక కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే తుది దశలో ఉన్న ఆచార్య షూటింగ్ పనులను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.

బోయపాటి , బాలయ్య లతో వర్క్ అద్భుతం - ప్రగ్య జైస్వాల్
“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయిన ప్రగ్య జైస్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు.

ఫరియా అబ్దుల్లా బ్లాక్ &వైట్ ఫొటో
థియేటర్ ఆర్టిస్ట్ , డ్యాన్సర్ , హైదరాబాదీ ఫరియా “జాతిరత్నాలు” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో చిట్టి పాత్రలో ఫరియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా మంచు విష్ణు 'చదరంగం'
ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్నారు మన హీరోలు. వారిలో మంచు వారసుడు హీరో మంచు విష్ణు కూడా ఒకడు. విష్ణు కూడా ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. ఇటీవలే మోసగాళ్లు లాంటి సినిమాను తన ప్రొడక్షన్ నుండే నిర్మించి రిలీజ్ చేశాడు. ఇక ఇదిలా ఉండగా చదరంగం వెబ్ సిరీస్ తో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి కూడా మంచు విష్ణు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రాజ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు.

అనసూయకు అభిమానుల బర్త్ డే విషెస్
మాటలతోనే కాకుండా , తన అందచందాలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ యాంకర్ అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. .టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం“పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “, “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

అందరూ జాగ్రత్తగా ఉండండి - చిరంజీవి
2020 సంవత్సరం లో కరోనా మహమ్మారి కారణంగా 9 నెలల పాటు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తో ప్రజలకు భారీగా ధన , ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో నని ప్రజలు భయాందోళన కు గురి అవుతున్నారు. సినీ సెలబ్రిటీస్ కరోనా జాగ్రత్తలతో ప్రజలకు సూచనలను ఇస్తున్నారు. కరోనా సెకండ్‌వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందనీ , ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలనీ మెగా స్టార్ చిరంజీవి వీడియో సందేశం ద్వారా కోరారు.