కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి , రిలీజ్ లు ఆగిపోయి , థియేటర్స్ మూతబడి చిత్ర పరిశ్రమ పలు విధాలా నష్టపోయిన విషయం తెలిసిందే. 9నెలల తరువాత అంతా సక్రమం గా జరుగుతున్న తరుణం లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో తిరిగి చిత్ర పరిశ్రమకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి రూపొందించిన సినిమాలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడ్డాయి. చిన్న సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లలో రిలీజ్ అవుతున్నా పలువురు నిర్మాతలు తమ మూవీస్ ను థియేటర్స్ లలో రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న “ఆచార్య “, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రూపొందిన “లవ్ స్టోరీ “, వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా , సాయి పల్లవి జంటగా రూపొందిన “విరాటపర్వం “, శివ నిర్వాణ దర్శకత్వంలో నాని , రీతూ వర్మ జంటగా రూపొందిన “టక్ జగదీష్ “, రమేష్ వర్మ దర్శకత్వంలో రవి తేజ హీరోగా తెరకెక్కిన “ఖిలాడి “, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందిన “నారప్ప “, సంపత్నంది దర్శకత్వంలో గోపీచంద్ ,తమన్నా జంటగా రూపొందిన “సీటీమార్ “, ఎస్ ఎస్ రాజు దర్శకత్వంలో తేజ సజ్జా , ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా రూపొందిన “ఇష్క్ ” , విశ్వక్ సేన్ “పాగల్ ” మూవీస్ విడుదల వాయిదా పడ్డాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: