టాలీవుడ్ ‘ట్విట్టర్ స్టార్స్’

Here’s A Quick Rundown Of Tollywood Stars With Highest Number Of Followers On Twitter,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood’S Top Stars With The Highest Number Of Twitter Followers,Tollywood Stars With Highest Number Of Twitter Followers,Twitter,Twitter Followers,Top Tollywood Star Highest Followers On Twitter,Highest Twitter Followers,Celebrities With Highest Social Media Followers,Twitter Top Follower,Tollywood Celebrities With Highest Number Of Followers,Most Followed Tollywood Actors On Twitter,Top 10 Tollywood Actors With The Most Twitter Followers,Mahesh Babu,Allu Arjun,Jr NTR,Ram Charan,Pawan Kalyan,Chiranjeevi,Tollywood Top Heros Following in Twitter,Celebrities Twitter Followers,Celebrates In Twitter,Tollywood Top Twitter Followers,Telugu Hero Twitter Followers,Mahesh Babu Twitter Followers,Allu Arjun Twitter Followers,Pawan Kalyan Twitter Followers,Ram Charan Twitter Followers,Jr Ntr Twitter Followers,Twitter Records,Tollywood Twitter Records

ఒక సినిమా ప్రమోషన్ కు సోషల్ మీడియా ఎంత ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడంటే ఇలాంటి మాద్యమాల అవసరం ఏం ఉండేది కాదు. కానీ టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఫోన్ లోనే ప్రపంచాన్ని చూసేస్తున్నారు. సోషల్ మీడియాలోనే అన్నీ అప్ డేట్స్ తెలుసుకుంటారు. అందుకే ఒకప్పుడు కాస్త సోషల్ మీడియాకు దూరంగా ఉండే మన హీరోలు కూడా ఇప్పుడు ట్విట్టర్, ఇన్స్టా ఖాతాల్లో యాక్టీవ్ అవుతున్నారు. తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇక మన హీరోలను ఫాలో అయ్యే ఫ్యాన్స్ కూడా మిలియన్స్ లో ఉన్నారు. అంతేకాదు ఇక్కడ కూడా ఎవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు.. ఎన్ని మిలియన్స్ మంది ఉన్నారు అన్నది కూడా లెక్కే. మరి మనహీరోల ట్విట్టర్ ఖాతాల్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు.. ఎవరు ఏస్థానంలో ఉన్నారో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్: టాలీవుడ్ లో సూపర్ స్టార్ అన్న బిరుదును సొంతంచేసుకున్న మహేష్ సోషల్ మీడియాలో కూడా అత్యధిక ఫాలోవర్స్ ను సొంతం చేసుకొని మొదటిప్లేస్ లో నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 11.4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌తో టాప్‌లో ఉన్నారు. ఇక మహేష్ కూడా 31 మందిని ఫాలో అవుతున్నారు.

అల్లు అర్జున్‌: మహేష్ తరువాత ఆ తరువాత స్థానాన్ని బన్నీ కొట్టేశాడు. బన్నీ కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాడు. తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తో పాటు పిల్లలకు సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటాడు. బన్నీ ఇప్ప‌టి వ‌ర‌కూ 5.8 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్నాడు.

న్టీఆర్‌: ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే సోషల్ మీడియాలో కాస్త తక్కువగానే యాక్టీవ్ గానే ఉంటాడు. సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను కూడా రేర్ గానే ఇస్తుంటాడు. ఒకరకంగా పిల్ల‌లకు సంబంధించిన విషయాల‌ను ఎన్టీఆర్ ఎక్కువ‌గా పోస్ట్ చేస్తుంటారు. ఇదిలాఉండగా ఇప్పటివరకూ తార‌క్‌కు ట్విట్ట‌ర్‌లో 4.9 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళిని మాత్ర‌మే తార‌క్ ఫాలో అవుతున్నారు.

రామ్‌చ‌ర‌ణ్‌: రామ్ చరణ్ గ‌త ఏడాది మార్చిలోనే ట్విట్ట‌ర్‌లో జాయిన్ అయ్యారు. ఏదో ఇంపార్టెంట్ అప్ డేట్స్ తప్ప చరణ్ కూడా చాలా తక్కువగానే యాక్టీవ్ గా ఉంటాడు. ఇక ఇప్పటివరకూ రామ్ చరణ్ వన్ మిలియన్ ట్విట్ట‌ర్ ఫాలో వ‌ర్స్ మార్క్‌ను రీచ్ అయ్యారు. ఈయ‌న‌కు ఇప్ప‌టి దాకా ఉన్న ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ 1.3 మిలియ‌న్. ఇక చ‌ర‌ణ్ తండ్రి చిరంజీవి, బాబాయ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ల‌ను ఫాలో అవుతున్నారు.

ప‌వన్‌క‌ళ్యాణ్‌: జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో ప‌వ‌న్ ఒక‌రు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఇక ఇప్పటివరకూ పవన్ వన్ మిలియన్ ఫాలోవ‌ర్స్‌ను సొంతం చేరుకున్న ప‌వ‌న్ 249 మందిని ఫాలో అవుతున్నారు.

చిరంజీవి: వీరందరి కంటే చిరు చాలా లేట్ గానే ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతఏడాది లాక్ డౌన్ లోనే ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేశాడు. లేట్ గా వచ్చినా చిరు మాత్రం చాలా యాక్టీవ్ గానే ఉంటాడు. సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రమే కాదు.. సోషల్ మేసెజెస్ కూడా ఇస్తుంటారు. రీసెంట్‌గానే చిరంజీవి వ‌న్ మిలియ‌న్ మార్క్‌ను రీచ్ అయ్యారు. చిరంజీవి కూడా ఎవ‌రినీ ఫాలో కావ‌డం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − eight =