సమంత యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా సరే తను అలా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది. అల్లరి పాత్ర అయినా.. ఎమోషనల్ పాత్ర అయినా.. రంగస్థలంలోని డీగ్లామర్ పాత్రలో అయినా.. మరీ ముఖ్యంగా సూపర్ డీలక్స్ లో లాంటి బోల్డ్ పాత్ర అయినా సరే సమంత చాలా ఈజ్ తో నటించగలిగే సత్తా ఉన్న నటి. అందుకే అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగి ఇప్పటికే అదే ఫామ్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాను ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈవెబ్ సిరీస్ లో కూడా సమంత మరో మంచి పాత్రతో వస్తుంది. ఈవిషయాన్ని ఈవెబ్ సిరీస్ డైరెక్టర్లు రాజ్ నిడిమోరు, కృష్ణ డికె నే స్వయంగా చెపుతున్నారు. ఈసిరీస్ లో సామ్ బోల్డ్ పాత్రలో నటిస్తుందని..నిజంగా ఈపాత్రలో సామ్ నటిస్తుందో లేదో అనుకున్నాం.. కానీ సామ్ మాత్రం ఒప్పుకుంది.. ఈసిరీస్ లో సామ్ పాత్ర చూసి అందరూ షాకవుతారు. సామ్ కూడా ఈసిరీస్ రిలీజ్ కోసం ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేస్తుంది అని డైరెక్టర్లు తెలిపారు.
మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చి ఎంత హిట్ అయిందో తెలుసు. దీంతో మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. మరి ఈసిరీస్ ఎంత హిట్ అవుతుందో చూద్దాం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: