మాటలతోనే కాకుండా , తన అందచందాలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ యాంకర్ అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. .టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం“పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “, “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అనసూయ తన ఫొటో షూట్ ఫొటోస్ , వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్నారు. మోడరన్ డ్రెస్ లలో అందం గాకనిపిస్తూ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్నఅనసూయ ఈ రోజు తన 36 వ బర్త్ డే ను జరుపుకుంటున్నారు.సోషల్ మీడియా వేదికగా అభిమానులు అనసూయకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. స్పెషల్ సాంగ్స్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీస్ లో కీలక పాత్రలకు ఆఫర్స్ అందుకుంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: