
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 30


టాలీవుడ్ లో 30 సంవత్సరాలు పూర్తి

స్లో &స్టడీ విన్స్ ది రేస్ రీతూవర్మ పాలసీ

సాగర తీరాన పూజాహెగ్డే

శంకర్-చరణ్ కోసం స్టార్ రైటర్

టాలీవుడ్ లో షూటింగ్స్ సందడి

"జెర్సీ "మూవీ కాంబినేషన్ మరోసారి ?

టాలీవుడ్ లో బిజీగా నటుడు , దర్శకుడు సముద్ర ఖని

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "RX 100 "

ప్రభాస్ పై భాగ్యశ్రీ ప్రశంసలు

సెట్ లో అడుగుపెట్టిన 'అఖండ'

దాసరి బయోపిక్ "దర్శక రత్న"

బీచ్ లో మెహరీన్ ఎంజాయ్

తల్లి పాత్రలో కాజల్ అగర్వాల్

తమన్నా డ్యాన్సింగ్ టాలెంట్

మ్యాజిక్ క్రియేట్ చేసిన బాహుబలి కి 6 ఏళ్లు

"పుష్ప "సెట్స్ లో అనసూయ

భారీ క్లైమాక్స్ తో "లైగర్ "

రాశీఖన్నా లేటెస్ట్ వర్కౌట్

'సందీప్ కిషన్' బ్యాక్ టు యాక్షన్

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రాశీఖన్నా
సక్సెస్ ఫుల్ “ఊహలు గుసగుసలాడే” మూవీ తో రాశీఖన్నా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా తమిళ మూవీస్ లో బిజీగా మారారు.హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.అందాల రాశీఖన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఫోటోషూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫోటోలను షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ లో 30 సంవత్సరాలు పూర్తి
బాలీవుడ్ మూవీ "హమ్ నౌజవాన్ " మూవీ తో కెరీర్ ప్రారంభించిన టబు సక్సెసఫుల్ "కూలీ నెం 1 "మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ బాలీవుడ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన టబు బ్లాక్ బస్టర్ "కాదల్ దేశం "మూవీ తో కోలీవుడ్ కు , "కాలాపానీ "మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. "ప్రేమ దేశం" , నిన్నే పెళ్ళాడతా ", "ఆవిడా మా ఆవిడే " ,"చెన్నకేశవ రెడ్డి ", "పాండురంగడు "వంటి మూవీస్ లో టబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

స్లో &స్టడీ విన్స్ ది రేస్ రీతూవర్మ పాలసీ
సక్సెస్ ఫుల్ “ప్రేమ ఇష్క్ కాదల్” మూవీ తో రీతూవర్మ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “పెళ్ళిచూపులు ” మూవీ లో రీతువర్మ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కొన్ని తమిళ మూవీస్ లో రీతూవర్మ నటించారు. హీరో నాని , రీతూవర్మ జంటగా రూపొందిన “టక్ జగదీష్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

సాగర తీరాన పూజాహెగ్డే
సక్సెస్ ఫుల్ "ఒక లైలాకోసం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు.

శంకర్-చరణ్ కోసం స్టార్ రైటర్
రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమాకు ఇన్ని రోజులు బ్రేక్ పడగా.. రీసెంట్ గానే ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. మరోవైపు ఆచార్య సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా ఫైనల్లో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా మరోవైపు చరణ్ శంకర్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. లైకాకు.. శంకర్ కు మధ్య వివాదానికి కూడా ఫుల్ స్టాప్ పడటంతో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

టాలీవుడ్ లో షూటింగ్స్ సందడి
కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి , రిలీజ్ లు ఆగిపోయి దాదాపు 3 నెలల పాటు చిత్ర పరిశ్రమ స్తంభించిపోయింది. జూలై నెలలో పవన్ కళ్యాణ్ "అయ్యప్పనుమ్ కోషియమ్ " తెలుగు రీమేక్ మూవీ, విజయ్ దేవరకొండ "లైగర్ " తప్ప లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయిన మూవీస్ అన్నీ పునః ప్రారంభం అయ్యాయి. పలు మూవీ షూటింగ్స్ తో టాలీవుడ్ కళ కళ లాడుతుంది.

"జెర్సీ "మూవీ కాంబినేషన్ మరోసారి ?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హీరో నాని , శ్రద్ధ శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ "మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని తన సహజమైన నటనతో సినిమాకు ప్రాణం పోశారు . ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో కళ్ళతో పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. షాహిద్ కపూర్ హీరో గా "జెర్సీ" హిందీ రీమేక్ "జెర్సీ " మూవీను దర్శకుడు గౌతమ్ తెరకెక్కిస్తున్నారు.

టాలీవుడ్ లో బిజీగా నటుడు , దర్శకుడు సముద్ర ఖని
" పార్తాలే పరవశం "(2001)తమిళ మూవీ తో సముద్రఖని నటుడిగా కెరీర్ ప్రారంభించారు. "ఉన్నై చరణదేందేన్ "(2003 ) మూవీ తో సముద్రఖని దర్శకుడిగా మారారు. ఈ మూవీ కి బెస్ట్ స్టోరీ రైటర్ గా సముద్రఖని తమిళ నాడు స్టేట్ అవార్డ్ అందుకున్నారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన సముద్రఖని పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ ను తెరకెక్కించారు. "విచారణై "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "RX 100 "
కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన "RX 100 "మూవీ 2018 సంవత్సరం జూలై 12 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించింది. హీరో కార్తికేయ తన యాక్టింగ్ , డ్యాన్స్ , ఫైట్స్ తో నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. "RX 100 "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్తికేయ , పాయల్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

ప్రభాస్ పై భాగ్యశ్రీ ప్రశంసలు
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

సెట్ లో అడుగుపెట్టిన 'అఖండ'
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు వరుసగా సినిమాల షూటింగ్‌లు ప్రారంభమవుతున్నాయి. మరోవైపు రెడీగా ఉన్న చిత్రాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈనేపథ్యంలో బాలకృష్ణ కూడా సెట్ లోకి అడుగుపెట్టాడు. ఈరోజు హైదరాబాదులో ఈ చిత్రం తుది షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. `అఖండ` షూటింగ్ రీ స్టార్ట్ చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఏకంగా సెట్‌లోని ఓ పోస్టర్‌ని పంచుకుంది యూనిట్. అఘోర లుక్‌లో బాలయ్య కనిపిస్తున్నాడు. హీరో బాలకృష్ణపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. త్వరలోనే అన్ని పనులు పూర్తిచేసి విడుదల చేసేందుకు రెడీ…

దాసరి బయోపిక్ "దర్శక రత్న"
సక్సెస్ ఫుల్ "తాతా మనవడు" (1972 )మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దాసరి నారాయణరావు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. దాదాపు 50 మూవీస్ కు దర్శకత్వం వహించిన దాసరి పలు మూవీస్ బెస్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ అందుకున్నారు. టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా ఉన్న దాసరిచిత్ర పరిశ్రమకు పలు సేవలు అందించారు. దాసరి వద్ద అసిస్టెంట్స్ గా పనిచేసిన పలువురు దర్శకులుగా మారారు. రైటర్ , యాక్టర్ , డైరెక్టర్ దాసరి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ మూవీ "దర్శకరత్న " తెరకెక్కనుంది.

బీచ్ లో మెహరీన్ ఎంజాయ్
సక్సెస్ ఫుల్ "కృష్ణ గాడి వీర ప్రేమ గాథ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయినపంజాబీ బ్యూటీ మెహరీన్ "మహానుభావుడు ", రాజా ది గ్రేట్ "," F 2:ఫన్ &ఫ్రస్టేషన్ "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. "నెంజిల్ తునివిరుందాయ్ "మూవీ తో కోలీవుడ్ కు , "డి ఎస్ పి దేవ్ " మూవీ తో పంజాబీ చిత్రపరిశ్రమకు మెహరీన్ పరిచయం అయ్యారు. మెహరీన్ ప్రస్తుతం " F 2:ఫన్ &ఫ్రస్టేషన్ " మూవీ సీక్వెల్ "F 3 "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. మారుతి-సంతోష్ శోభన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తల్లి పాత్రలో కాజల్ అగర్వాల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియా లో తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కాజల్ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

తమన్నా డ్యాన్సింగ్ టాలెంట్
సక్సెస్ ఫుల్ "శ్రీ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మ్యాజిక్ క్రియేట్ చేసిన బాహుబలి కి 6 ఏళ్లు
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి కొత్తగా చెప్పేదేముంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి చిత్రం ఇండియన్ సినిమాగా టర్న్ తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగు సినిమా హద్దుల్ని చెరిపేసి.. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. దేశ వ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోల కలెక్షన్లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్టానంలో నిలిచింది బాహుబలి సిరీస్.

"పుష్ప "సెట్స్ లో అనసూయ
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు .జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

భారీ క్లైమాక్స్ తో "లైగర్ "
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది.హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో విజయ్ దేవరకొండ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.

రాశీఖన్నా లేటెస్ట్ వర్కౌట్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.అందాల రాశీ ఖన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఫోటోషూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫోటోలను షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.

'సందీప్ కిషన్' బ్యాక్ టు యాక్షన్
ప్రస్తుతం సందీప్ కిషన్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'గల్లీ రౌడీ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొనే పనిలో ఉంది. ఎలాగూ థియేటర్లు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి.. త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.