రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ లు తెలుగు సినిమా స్థాయిని ఏ రేంజ్ కు తీసుకెళ్లాయే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది. ఇక ఈ సినిమా ఎన్నో సినిమాలకు స్ఫూర్తి అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలకు బాహుబలి ఒక ఇన్స్పిరేషన్. మరి అలాంటి సినిమా తరువాత ప్రభాస్ చేయబోయే సినిమాపై ఎన్ని అంచనాలు ఉంటాయో తెలియంది కానీ. ముఖ్యంగా డైరెక్టర్ కు ఎంత ప్రెజర్ గా ఉంటుందో తెలిసిందే. అలాంటి ప్రెజర్ ను తట్టుకొని సాహో లాంటి సినిమాను తీసి గ్రేట్ అనిపించుకున్నాడు సుజీత్. దానికితోడు అంత రేంజ్ లో పేరువచ్చిన తరువాత ప్రభాస్ సుజీత్ కు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో సుజీత్ సాహో సినిమాను రూపొందించాడు. 2019లో రిలీజ్ అయిన ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది. ప్రస్తుతం కొత్తసినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ గురించి ప్రభాస్ కు తనపై ఉన్న నమ్మకం గురించి చెప్పుకొచ్చాడు. నామీద నాకంటే ప్రభాస్ అన్నకే నమ్మకం ఎక్కువ.. ఇప్పుడు కాల్ చేసి సినిమా చేద్దామని అడిగినా ఓకే చెపుతాడు అని చెప్పుకొచ్చాడు. మరి చూద్దాం వీరిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమా ఎప్పుడొస్తుందో..
ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా.. ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి. ఈసినిమా తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరొసినిమా చేయనున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: