రీఎంట్రీ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి ఫిక్సయ్యారు పవన్ కళ్యాణ్. ‘వకీల్ సాబ్’ తర్వాత వెంటనే వరుస సినిమాల షూటింగ్ లతో బిజీ అయ్యారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అలాగే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమాలు చేస్తుండగా.. రెండు సినిమాలు షూటింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. సెకెండ్ వేవ్ కారణంగా రెండు సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే వీటిలో ముందుగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’రీమేక్ షూటింగ్ రీస్టార్ట్ అవుతోంది. ఈ నెల 12నండి మొదలయ్యే షెడ్యూల్‌లో ముందుగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరించడానికిప్లాన్ చేశారట. పవన్, రానాల మధ్య జరిగే ఈ ఫైట్ సీన్‌ని సినిమాకే హైలైట్ అయ్యేలా కంపోజ్ చేస్తున్నారట. దీనికోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ వేసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటించనున్నారు.
పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా పవన్ కళ్యాణ్, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో రానా కనిపించనున్నట్టు తెలుస్తోంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: