జై బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆరడుగుల బుల్లెట్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రకాష్ రాజ్ ,అభిమన్యు సింగ్ , కోట , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2017 సంవత్సరం జూన్ 9 వ తేదీ రిలీజ్ కావాల్సిన “ఆరడుగుల బుల్లెట్” మూవీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ తో నిలిచిపోయింది. నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ .. లవ్, యాక్షన్ అంశాలతో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ ఇదనీ , . బరువు బాధ్యతలు లేకుండా జీవితాన్ని సరదాగా గడిపే ఓ యువకుడు బెజవాడ రౌడీతో ఎందుకు పోరాటం చేయాల్సివచ్చిందనేదే ఈ చిత్ర కథనీ . గోపీచంద్ పాత్ర శక్తివంతంగా ఉంటుందనీ , మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుందనీ చెప్పారు. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ , తమన్నా జంటగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీ కరోనా కారణం గా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: