‘రాధేశ్యామ్’ షూటింగ్ అప్ డేట్

An Interesting Update About Rebel Star Prabhas and Pooja Hegde Starrer Radhe Shyam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Update,Telugu Movies Updates,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Movie Updates,Radhe Shyam Telugu Movie Latest News,Prabhas Radhe Shyam Movie Latest Update,Prabhas And Pooja Hegde Radhe Shyam Telugu Movie Live Updates,Radhe Shyam Movie Shooting Details,Radhe Shyam Telugu Movie Shooting Latest News

యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్‘ కూడా ఉంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా ఇటీవలే లాస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. జమ్మలమడుగు గండికోటలో ఈసినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా జరుపుకుంటుండగా ఇప్పుడు దాదాపు షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీరియాడికల్ లవ్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండటంతో ఈసినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ షూట్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈసందర్భంగా డైరెక్టర్ రాధేశ్యామ్ మాట్లాడుతూ.. ఈ టెంపుల్ కు చాలా కాలం క్రితం రావడం జరిగింది.. ఈ సినిమాకు టెంపుల్ సీన్స్ చాలా కీలకం అందుకే ఒక మంచి టెంపుల్ కోసం అందులోనూ పూర్తిగా స్టోన్ తో చేసిన టెంపుల్ కోసం చూస్తుండగా అప్పుడు ఈ టెంపుల్ అయితే బావుంటుందనే ఐడియా వచ్చింది.. ఇక ఇదే కరెక్ట్ టెంపుల్ అని భావించి ఇక్కడ షూటింగ్ చేశాం అని చెప్పడం జరిగింది. ఇంకా ఈసినిమా కోసం అక్కడే కొన్ని సెట్ లు వేయడం జరిగింది.. నవగ్రహ హోమం ప్లేస్, డ్యాన్స్ హాల్ ఇలా కొన్ని సెట్స్ వేయడం జరిగింది.. ఈ సెట్స్ కోసం దాదాపు 10 మంది 300 రోజులు కష్టపడ్డారు… అంతేకాకుండా వెయ్యి మంది వేద పండితులను తీసుకురావడం జరిగింది.. అఘోరాలు సైతం కనిపిస్తారు అని నిర్మాత తెలిపారు.

కాగా యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − one =