బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కతా నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ ను సాయి పల్లవి కంప్లీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డ్రీమ్ వారియర్ బ్యానర్ పై గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందనున్న తమిళ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాయి పల్లవి త్వరలో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యే అవకాశం ఉంది. సాయి పల్లవిని చాలా మంది నాచురల్ బ్యూటీ అంటూ అభిమానిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మంది సాయి పల్లవిని అభిమానించే వారు ఆమెను మేకప్ లేకుండానే ఇష్టపడుతారు. సోషల్ మీడియాలో తన ఫొటోలను చాలా రేర్ గా షేర్ చేస్తూ ఉండే సాయి పల్లవి తాజాగా చీర కట్టులో ఇలా జుట్టు సింపుల్ గా వదిలేసిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: