GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో నాని , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “భలే భలే మగాడివోయ్ ” మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మురళీశర్మ , నరేష్ , సితార , అజయ్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు. హీరో నాని కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, మతిమరుపు నేపథ్యంలో కొన్ని విచిత్ర పరిస్థితుల్లో అతడిచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ అద్భుతంగా పండాయి. హీరో నాని , లావణ్య త్రిపాఠి ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2015 సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీ రిలీజ్ అయిన “భలే భలే మగాడివోయ్ ” మూవీ నేటితో 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అద్భుతమైన స్టోరీ , స్క్రీన్ ప్లే తో “భలే భలే మగాడివోయ్” మూవీని పూర్తి ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించి దర్శకుడు మారుతి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు గోపిసుందర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: