లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాను లాంఛనంగా ప్రారంభించారు కూడా. ఇక ఇన్ని రోజులు చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు చరణ్. దీంతో త్వరలోనే శంకర్ సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నాడు. ఇప్పటికే ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతుందనే వార్తలు ఎప్పటినుంచో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. RC15 మూవీ షూటింగ్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది. పూణెలో మొదటి షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా అంజలి, సునీల్, శ్రీకాంత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దిల్ రాజు కెరీర్ లో వస్తున్న 50వ సినిమా కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: