సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ “మహాసముద్రం” మూవీ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీకార్తిక్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన “ఒకే ఒక జీవితం”మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో శర్వానంద్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న “ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో శర్వానంద్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం 2008 సంవత్సరం లో అజిత్ హీరోగా రూపొందిన “ఏగన్” తమిళ మూవీ కి దర్శకత్వం వహించారు. చాలా రోజులుగా రాజు సుందరం దర్శకుడిగా ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలానికి శర్వానంద్ హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారనీ, ఈ ప్రాజెక్ట్ కి వక్కంతం వంశీ కథ-స్క్రీన్ ప్లే అందిస్తున్నారనీ , చాలా కాలంగా రాజు సుందరం-శర్వానంద్ ల మధ్య ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయనీ సమాచారం. ఫైనల్ గా శర్వా నంద్ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: