కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా లవ్ స్టోరీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇప్పటి వరకూ కూల్ సినిమాలతో అలరించిన శేఖర్ కమ్ముల ధనుష్ తో చేయబోయేది థ్రిల్లర్ మూవీ అని క్లారిటీ ఇచ్చాడు. ఇంకా మల్టీ లింగ్వువల్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నానని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈసినిమా రిలీజ్ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక ఫైనల్ గా ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిపారు.
కాగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తుండగా… తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూాడా ఈసినిమాను విడుదల చేయనున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: