టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”, “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “శాకుంతలం ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
తెలుగు , తమిళ భాషలలో అధిక ఫాలోయింగ్ ఉన్న సమంత తన రియల్ లైఫ్ , రీల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ భాషల హీరోయిన్స్ చాలామందితోసమంత కు మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్లంతా కూడా తరచూ కలుసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా షూటింగు లేని సమయం దొరికితే చాలుసమంత తన స్నేహితులతో గడపడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. వీకెండ్స్ లోను స్నేహితులతో కలిసి సందడి చేస్తారు. త్రిష , కీర్తి సురేశ్ , కల్యాణి ప్రియదర్శన్ , ప్రీతమ్ జూకాల్కర్ తో కలిసి సరదాగా గడుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: