సూపర్ హిట్ “ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా ఒక హిందీ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, అందాల రాశీఖన్నా , జాతీయ అవార్డ్ గ్రహీత అమోల్ పాలేకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోవా, ముంబైలోని పలు ప్రాంతాల్లో అమోల్ పాలేకర్ పై వచ్చే సన్నివేశాలను దర్శకులు చిత్రీకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిబ్రవరి నెలలో షాహిద్ కపూర్, రాశీ ఖన్నాలతో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభమయ్యింది. విజయ్ సేతుపతి ఆగస్ట్ లోనే తన పాత్ర చిత్రీకరణలో పాల్గొన్నారు. విజయ్ సేతుపతి తో మూడవ సారి నటించే అవకాశం రావడం పట్ల తమ ఎక్జయిట్ మెంట్ ను రాశీఖన్నా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ వెబ్ సిరీస్ లో తెలుగు , తమిళ భాషల మూవీస్ లో బిజీగా ఉన్న హీరోయిన్ రెజీనా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. నెలపాటు చిత్రీకరణ కొనసాగనుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: