“గల్లీ రౌడీ”మూవీ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సందీప్ కిషన్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “ఎక్కడికి పోతావు చిన్నవాడా” మూవీ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతుంది. “అలా ఎలా” మూవీ ఫేమ్ ఖుషి , కావ్యథాపర్ కథానాయికలు. వెన్నెల కిషోర్, వైవాహర్ష ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శేఖర్‌చంద్ర సంగీతం అందిస్తున్నారు. రాజేష్ దండ నిర్మాత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెం1 గా తెరకెక్కుతున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ఆదివారం ప్రారంభం అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి కామెడీ హీరో అల్లరి నరేష్ క్లాప్‌నిచ్చారు. హీరో నాగశౌర్య కెమెరా స్విఛాన్ చేశారు. విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రాజేష్ మాట్లాడుతూ .. వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిదనీ , . ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా ఉంటుందనీ , .అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామనీ తెలిపారు. “టైగర్”మూవీ తరువాత హీరో సందీప్‌కిషన్, వి.ఐ ఆనంద్ కాంబినేషన్ లో ఆరు సంవత్సరాల తరువాత ఈ మూవీ తెరకెక్కుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: