సరైన కథలను ఎంచుకోలేకపోయా..!

Director Srinu Vaitla Confesses About Selecting His Movie Stories,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Director Srinu Vaitla,Srinu Vaitla,Srinu Vaitla Movies,Srinu Vaitla New Movie,Srinu Vaitla Latest Movie,Srinu Vaitla Upcoming Movie,Srinu Vaitla Latest News,Srinu Vaitla News,Srinu Vaitla Movie Updates,Srinu Vaitla Movie News,Srinu Vaitla Upcoming Movies,Srinu Vaitla New Movies,Srinu Vaitla Latest Film Updates,Srinu Vaitla New Movie Updates,Srinu Vaitla Latest Movie Updates,Srinu Vaitla Next Projects,Srinu Vaitla Upcoming Projects,Srinu Vaitla New Projects,Srinu Vaitla Next Project News,Srinu Vaitla Updates,Srinu Vaitla About Selecting His Movie Stories,Director Srinu Vaitla Latest News,Director Srinu Vaitla Movies,Srinu Vaitla Latest Film News,Latest 2021 Telugu Movie Updates,Srinu Vaitla About His Movies,Dookudu,Mahesh Babu,Samantha Akkineni,S Thaman,Dookudu Movie,Dookudu Telugu Movie,Dookudu Telugu Full Movie,Dookudu Full Movie,Dookudu Movie Update,Dookudu Movie Updates,Dookudu Movie Latest Updates,Dookudu Movie Update,Mahesh Babu Dookudu Movie Completes 10 Years,Dookudu Completes 10 Years,Dookudu Movie Completes 10 Years,10 Years Of Dookudu,10 Years Of Dookudu Movie,10 Years For Dookudu,10 Years For Dookudu Movie,Mahesh Babu's Dookudu Completes 10 Years,Srinu Vaitla About Dookudu Movie,Teravenuka Kathalu Dookudu Full Episode,Srinu Vaitla Latest Interview,Srinu Vaitla Interview,#Dookudu,#SrinuVaitla

ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది యాక్షన్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ లు అయితే కొంతమంది కామెడీ సినిమాలు, అలాగే సెన్సిబుల్ సినిమాలో తీయడంలో ఇంకొందరు ఎక్స్పర్ట్ లు అయి ఉంటారు. ఈనేపథ్యంలో శ్రీనువైట్ల కూడా తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒకమార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు తన సినిమాల్లో కామెడీని కూడా అదే రేంజ్ లో పండించగల డైరెక్టర్ శ్రీనువైట్ల. ఈమధ్య కాస్త వెనుకబడ్డాడు కానీ ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నేడు తన డైరెక్షన్ లో వచ్చిన దూకుడు సినిమా 10ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక ఈసందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ.. దూకుడు సినిమా అప్పట్లో నిజంగా పెద్ద ప్రయోగం.. అయితే ఈ సినిమా ఖచ్చితంగా ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందన్న ధీమా ఉండేది. మేము ఊహించిన దానికి మించి ప్రేక్షకులు భారీ విజయాన్ని అందించారు. మహేష్‌బాబును దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కథ ఇది. మహేష్‌ ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందని ఊహించుకున్నాను. అలా ఆ ఊహలో నుంచే కథ పుట్టింది. సినిమాలో పోలీస్‌గా, ఎమ్మెల్యేగా, ఫిల్మ్‌ మేకర్‌గా మహేష్‌ మూడు షేడ్స్‌ ఉన్న పాత్రలు పోషించారు. అవన్నీ వర్కవుటయ్యాయి. దాని వల్లే సినిమాకి ఆస్థాయి విజయం దక్కిందంటూ తెలిపాడు. అంతేకాదు‘దూకుడు’ తర్వాత ప్రేక్షకులు నా సినిమాల్లో కామెడీని ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేయడం మొదలుపెట్టారు.. దీంతో నా కామెడీ టైమింగ్‌కు తగిన కథల్ని సరిగ్గా ఎంచుకోలేకపోయా. ఫలితంగా పరాజయాలు చవిచూశా. అందుకే మళ్లీ ఆ పొరపాటు చేయను. ఇకపై ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుంటూనే.. నా కామెడీకి సూటయ్యే కథలే చేయాలని నిర్ణయం తీసుకున్నా అని తెలిపాడు. మరోసారి మహేష్ తో సినిమా చేయాలని ఉంది.. ఇప్పటికే కథాలోచనలో ఉన్నాను.. తప్పకుండా మహేష్ ను ఒప్పించి ఈసారి పెద్ద స్థాయిలో సినిమా చేస్తానని స్పష్టం చేశాడు.

ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల విష్ణుతో ఢీ అండ్ ఢీ సినిమా చేయనున్నాడు. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించాడు కూడా. అయితే ఇంతవరకూ ఈసినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే నవంబర్ నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి కల్లా ఈసినిమాను పూర్తిచేసి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు శ్రీనువైట్ల.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.