‘అఖండ’ ట్రైలర్ రిలీజ్

Balakrishna’s Akhanda Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Updates,Akhanda Telugu Movie Latest News,Akhanda Trailer,Akhanda Telugu Movie Trailer,Akhanda Movie Latest Trailer,Akhanda New Trailer

బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా అఖండ. ఈసినిమాతో ఇద్దరూ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. ది. ఇప్పటికే వదిలిన అప్డేట్లతో అఖండ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఎప్పటిలాగే బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి. ‘విధికి విధాతకు విశ్వానికి సవాళ్లు విసరకూడదు’.. అంటూ ట్రైలర్ మొదలవుతుంది.. ‘అంచనా వేయడానికి పోలవరం డ్యామా? పట్టిసీమ తూమా? పిల్ల కాలువ’, ‘ఒక మాట నువ్వంటే శబ్దం.. అదే నేను అంటే శాసనం.. దైవ శాసనం’, ‘మీకు సమస్య వస్తే దండం పెడతారు.. నేను పిండం పెడతాను’, ‘అఖండ.. నేనే నేనే’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక విలన్ పాత్రలో నటిస్తున్న శ్రీకాంత్ కు భయపట్టేశాడు. ‘నాకు బురద అంటింది.. నాకు దురద వచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది.. గడ్డ వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే’ అంటూ శ్రీకాంత్ కూడా తన విలనిజాన్ని చూపించాడు. జగపతి బాబు కూడా కొత్త గెటప్పులో కనిపించాడు. మొత్తానికి ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరో రేంజ్ కు తీసుకెళ్లారు. మరి సినిమా ఎలా ఉంటుందో.. హ్యాట్రిక్ ను కొడతారో లేదో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =