బిగ్ బాస్ హౌస్ ను మిస్ అవుతున్నాను నా టాప్ 5 వాళ్లే

Bigg Boss Telugu 5 Vishwa Interview About Her Journey In The House,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Bigg Boss Telugu 5 Vishwa,Bigg Boss Telugu 5 Vishwa Latest News,Bigg Boss Telugu 5 Vishwa New Interview,Bigg Boss Telugu 5 Vishwa Journey,Bigg Boss Telugu 5,Bigg Boss 5 Telugu,Vishwa Interview About Her Journey In The House

బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఎంతో మంది కంటెస్టెంట్స్ వస్తుంటారు వెళ్తుంటారు. అయితే ప్రతి సీజన్ లో మాత్రం ఫిజికల్ టాస్కుల్లో వంద శాతం ఎఫర్ట్ పెట్టే కంటెస్టెంట్ ఒకరు ఉంటారు. అలా సీజన్ 5 లో ఫిజికల్ టాస్కుల్లో టప్ కాంపిటీషన్ ఇచ్చిన కంటెస్టెంట్ విశ్వ. ఫిజికల్ టాస్కుల్లో విశ్వ ఉంటే హౌస్ మేట్స్ అందరూ భయపడిపోయేవారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇచ్చిన ప్రతి టాస్క్ లో దాదాపు తానే విజయాన్ని దక్కించుకునేవాడు. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన విశ్వ లాస్ట్ వరకూ ఉండలేకపోయాడు. ఇక 9వ వారం ఎలిమినేషన్ లో విశ్వ బయటకు వచ్చేశాడు. ఇది ఒకరకంగా తనకే కాదు హౌస్ మేట్స్ కు కూడా షాకింగే .అయితే ఈ సీజన్‌కే సూపర్‌ హీరో అనిపించుకుని మరీ షో నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. ఈనేపథ్యంలో బయటకు వచ్చిన విశ్వ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇండస్ట్రీ ఎంట్రీ
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నా ప్రయాణం 2002 లో మొదలయ్యింది. 2004 లో నా మొదటి సినిమా పెళ్ళికోసం విడుదల అయ్యింది. అదే ఏడాదిలో విడుదలైన విద్యార్థి సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

బిగ్ బాస్ ఎంట్రీ
బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఒక తెలుగు సినిమా ఒప్పుకున్నాను. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చింది, ఈ షో లో పాల్గొనేందుకు ప్రిపేర్ అయ్యి హౌస్ లోకి అడుగు పెట్టడం జరిగింది.

ఎలిమినేషన్
హౌస్ లోనుండి బయటికి రావడం నాకు షాకింగ్ గా ఉంది. హౌస్ లో ఉంటే ఇంకా బాగా ఆడే వాడినేమో, ఏదేమైనా ప్రేక్షకుల ఓటింగ్ ను నేను స్వాగతిస్తాను. అవకాశం ఉంటే మళ్లీ నేను హౌస్ లోకి వెళ్ళడానికి రెడీ. హౌస్ లో ఉన్నప్పుడు నేను నా వైఫ్, కొడుకును మిస్ అయిన ఫీలింగ్ కలిగింది.

నా దృష్టిలో టాప్ 5 కంటెస్టెంట్స్
శ్రీరామ్
రవి
సన్నీ
షణ్ముక్
సిరి

బిగ్ బాస్5 విన్నర్
శ్రీరామ్ బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ అవుతాడని నమ్మకం ఉంది. తన ఆట నాకు బాగా నచ్చుతుంది. ఈ హౌస్ లోకి ఎంటర్ అవ్వడం వల్ల నాకు లోబో అనే ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు .నాకు సిస్టర్స్ లేరు బట్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక సరయు బెస్ట్ సిస్టర్ అయ్యింది. మంచి కథలు వింటున్నాను. హీరోగా అవకాశం వస్తే చెయ్యడానికి రెడీ.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.