‘లైగర్’ కోసం రెడీ అవుతున్న మైక్ టైసన్

Mike Tyson Getting Ready for Liger Shoot, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Mike Tyson, Liger Shooting Updates, Video of Mike Tyson Getting Ready for Liger Shoot Vijay Deverakonda Liger Movie, Liger, Liger Movie, Liger Movie Latest News, Liger Movie Updates, Liger Telugu Movie, Vijay Deverakonda, Vijay Deverakonda Latest News, Vijay Deverakonda Next Movie Details

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నఈసినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. దీనిలో భాగంగానే తాజా షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈసినిమాలో భాగం అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఇంకా పెరిగాయి. ఇక ఈసినిమా కోసం మైక్ టైసన్ రెడీ అవుతున్నాడు. ఈ సందర్భంగా తను ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీడియోలో మైక్ టైనస్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడో.. తన పంచ్ పవర్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఖచ్చితంగా తను ఈసినిమాకు పెద్ద హైలెట్ గా నిలుస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈవీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 6 =