కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. రీసెంట్ గానే గని ప్రపంచం ఇదేనంటూ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆ వీడియోలో కీలకపాత్రలన్నీ చూపించారు. మరోవైపు ఈసినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 15న ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగ ఈసినిమాలో నటించే ముఖ్య పాత్రలకు సంబంధించి పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే నదియా పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక తాజాగా జగపతిబాబు పోషించిన ఈశ్వర్ నాథ్ పాత్రను పరిచయం చేస్తూ, ఈ రోజున ఆయన లుక్ ను రిలీజ్ చేశారు. ఇక డీసెంట్ లుక్ లో ఉన్న జగపతిబాబు లుక్ ఆకట్టుకుంటుంది.
Introducing @IamJagguBhai as ‘Eswarnath’ from the world of #Ghani 🥊🤩
2 Days to go…#GhaniTeaser out on Nov 15th! 🔥@IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @Naveenc212 @MusicThaman @george_dop @abburiravi @sidhu_mudda @Bobbyallu @adityamusic pic.twitter.com/FEoC1zRWbH
— Geetha Arts (@GeethaArts) November 13, 2021
ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. తనికెళ్ల భరణి, సాయి మంజ్రేకర్, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, ఉపేంద్ర తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాస్టింగ్ చూస్తే ఆ అంచనా రెట్టింపు అయ్యేలా ఉంది. మరి చూద్దాం వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్న వరుణ్ ఈసినిమాతో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో..
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























