తెలుగు ప్రేక్షకుల అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక హీరో పై అభిమానం పెంచుకున్నారంటే చాలు అది అంత ఈజీగా పోదు. అంతేకాదు కొంతమంది అభిమానులు తమ అభిమానాన్ని పలు మార్గాల ద్వారా చూపిస్తుంటారు కూడా. ఇక తాజాగా ఒక ప్రభాస్ ఫ్యాన్ తన అభిమానాన్నివెరైటీగా చూపించాడు. దానికి కోసం తన జుట్టంతా తీసేశాడు. కేవలం ప్రభాస్ అనే అక్షరాలు మాత్రమే వచ్చేలా హెయిర్ స్టైల్ డిజైన్ చేసుకున్నాడు. ఇక ఈవిషయం తెలుసుకున్న ప్రభాస్ తనతో కాసేపు ముచ్చటించి అనంతరం అభిమానికి ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అంతేనా కాస్ట్ లీ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి అభిమానిని సర్ ప్రైడ్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలతో పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగాడు. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రభాస్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
కాాగా ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తను నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. వచ్చే ఏదాది సంక్రాతికి సందడి చేయనుంది. దీనితో పాటు ఆది పురుష్, సలార్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. సలార్ కూడా దాదాపుగా చివరి దశకు వచ్చేసింది. ఇంకా నాగ్ అశ్విన్ తో అలానే సందీప్ వంగా తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: