టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, యాక్ట్రెస్ సత్యదేవ్-నిత్యమీనన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్కైలాబ్. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. సత్యదేవ్- నిత్య మీనన్ ఇద్దరూ మంచి కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటారు కాబట్టి ఈనేపథ్యంలో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. 1979 సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరిగాయి అనే నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈసినిమాపై అంచనాలను కూడా భారీగా పెంచేశారు. ఇదిలా ఉండగా ఈసినిమాను డిసెంబర్ 4న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోసారి రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేసింది నిత్యమీనన్. తన సోషల్ మీడియా ద్వారా స్కైలాబ్ సినిమాను డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు తెలిపారు.
View this post on Instagram
కాగా ఈసినిమాలో రాహుల్ రామకృష్ణ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.బైట్ ఫీచర్స్ , నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా.. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: