యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం సైలెంట్ గా ఒక సినిమా తర్వాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే SR కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా కిరణ్ మరో సినిమాను ప్రారంభించాడు. కిరణ్ హీరోగా కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. ఇక నేటి నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే కదా. కోడి దివ్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను తనే నిర్మించనుంది. సంజన ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు.
కాగా ఈసినిమా కంటే ముందే కిరణ్ చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సమ్మతమే’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లను రిలీజ్ చేశారు. కాగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రవీణ నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫర్. ఈసినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: