“11:11” మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

11:11 Movie Title And First Look Is Out, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, 11:11 Movie First Look, Chiranjeevi launches first look of movie 11:11, Megastar Chiranjeevi Launched 11:11 First Look, Actress Varsha Glam, Telugu Cinema News 2021, Koti's son Rajeev Saluri, Megastar Chiranjeevi, Chiranjeevi About Music Director Koti, music director Koti son Rajeev Saluri Movie

టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిల్మ్స్ బ్యానర్స్ పై కిట్టు నల్లూరి దర్శకత్వంలో సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి , వర్ష విశ్వనాథ్ జంటగా “11:11” మూవీ తెరకెక్కుతుంది. “11:11” మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. కోటితో తనకున్న అనుబంధం అంతా ఇంతా కాదనీ , తన సినిమాలకి ప్రత్యేకించి అన్ని రకాల హంగులతో ఆయన ఎంతో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని సంగీతం అందించారనీ . ముఖ్యంగా చెప్పాలంటే తన విజయానికి, ఎదుగుదలకి సింహభాగం రాజ్ – కోటిలదే అని చెప్పాలనీ , ఇద్దరు కూడా 80, 90 దశకంలో 90 శాతం సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారనీ , ఇంత మంచి హిట్ సాంగ్స్ ఇచ్చినటువంటి కోటిగారి రుణం తీర్చుకోలేకపోయానే అనే బాధ ఉండేదనీ , కానీ ఈ రోజు కోటిగారి కుమారుడు రాజీవ్‌ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు తన కు చాలా సంతోషంగా ఉందనీ , కోటిగారి రుణం ఇలా అయినా కొంత తీర్చుకోవడానికి ఈ వేడుక వేదిక అయ్యిందనీ, రాజీవ్‌కు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ నివ్వాలనీ , అలాగే రాజ్‌గారి అబ్బాయి సాగర్‌కు కూడా ఈ సినిమాలో అవకాశం కల్పించడం జరిగింది. సాగర్ కూడా తండ్రిని మించిన తనయుడు కావాలని కోరుకుంటున్నాననీ , టైగర్ హిల్స్ ప్రొడక్షన్ కూడా గొప్ప విజయం సాధించి ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాననీ , దర్శకుడు కిట్టుగారికి, హీరోయిన్ వర్షలకు ఈ సినిమా ద్వారా గొప్ప సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ చిత్ర యూనిట్ అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాననీ అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 12 =