మలయాళం సినిమాలో మంచు లక్ష్మీ

Manchu Lakshmi’s Malayalam Debut with Mohan Lal, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News, Manchu Lakshmi Malayalam Debut, Manchu Lakshmi, Mohan Lal, Lakshmi Manchu announced her Malayalam debut, Lakshmi Manchu Latest News, Lakshmi Manchu Upcoming Movie Details, Lakshmi Manchu Next Movie with Mohan Lal, Lakshmi Manchu Malayalam Movie

బుల్లి తెరపై, వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు వారసురాలు.. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ మొదటి సినిమాతోనే ఉత్తమ విలన్‌గా నంది అవార్డును సైతం అందుకుంది. ఆ తర్వాత ‘దొంగల ముఠా’, ‘చందమామ కథలు’, ‘గుండెల్లో గోదారి’, ‘దొంగాట’, ‘లక్ష్మీబాంబ్’​ ఇలా పలు సినిమాలలో నటించింది. పిట్టకథలు వెబ్​సిరీస్​ తో డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినిమాలో నటిస్తుంది. అది కూడా వేరే భాషలో. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా ‘మాన్‌స్టర్‌’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతుంది. ఇందులో మోహన్‌లాల్‌ లక్కీ సింగ్ అనే పవర్‌ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈసినిమాలో మంచు లక్ష్మీ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఈవిషయాన్ని తను తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది లక్ష్మీ. ఎట్టకేలకు క్యాట్‌ బయటకు వచ్చేసింది. కొత్త భాష, కొత్త జానర్‌.. సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌తో మలయాళంలో నటిస్తోన్న నా తొలి చిత్రంపై ఎంతో ఆసక్తిగా ఉన్నాను. ఈ సినిమాలో నటించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కోసం షూటింగ్‌లో పాల్గొన్న సమయం ఎప్పటికీ మరిచిపోలేనిది’ అంటూ ట్వీట్ లో పేర్కొంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =