‘దృశ్యం 2’ ట్రైలర్ రిలీజ్

Venkatesh’s Drushyam 2 Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Drushyam 2,Drushyam 2 Movie,Drushyam 2 Telugu Movie,Drushyam 2 Movie Updates,Drushyam 2 Telugu Movie Latest News,Drushyam 2 Trailer,Drushyam 2 Telugu Movie Trailer,Venkateshh,Meena

మలయాళం లో సూపర్ హిట్ అయిన్ దృశ్యం మూవీ తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే దృశ్యం 2 సినిమా రాగా దాన్ని కూడా తెలుగులో రీమేక్ చేశారు. మొదటి పార్ట్ లో నటించిన విక్టరీ వెంకటేష్ ఈసినిమాలో నటించారు. ఇక ఈసినిమా రిలీజ్ పై కూడా గత కొద్దికాలంగా ఎన్నో అనుమానాలు తలెత్తిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా లేక ఓటీటీలో రిలీజ్ అవుతుందా అన్న సస్పెన్స్ అయితే ఇన్ని రోజులు కొనసాగింది. ఫైనల్ గా రీసెంట్ గానే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. గత కొన్నిరోజులుగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వని మేకర్స్ రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తూ సినిమా రిలీజ్ ను కన్ఫామ్ చేశారు. నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈనేపథ్యంలో మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. కేస్ ఇన్వెస్టిగేషన్ ఎలా మలుపు తిరిగింది.. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనే ట్విస్ట్ లతో సినిమా ఉంటబోతుందని అర్థమవుతుంది.

కాగా ఈసినిమాలో మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 13 =