ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 94
గల్వాన్ వ్యాలీ నేపథ్యంలో బాలీవుడ్ మూవీ
"12'O Clock" మూవీ టీజర్ రిలీజ్
మరో మూవీ లో సంగీత దర్శకుడు
నెపోటిజంపై తాప్సీ స్పందన
లాక్ డౌన్ సమయం లో రామ్ చరణ్

"#NTR30" మూవీలో విలన్ గా మనోజ్ మంచు ?
అభిమానులకు మహేష్ బాబు థ్యాంక్స్
ఆ వార్తల్లో నిజం లేదు - ఆర్ జి వి
''12 O క్లాక్'' ట్రైలర్ రిలీజ్..!
దర్శకుడు రాజమౌళి పై తమన్నా ప్రశంసలు

''12 O క్లాక్'' తో భయపెడతా అంటున్న వర్మ..!
నిహారిక ఎంగేజ్ మెంట్ డేట్ అప్పుడే..?
పవన్ కళ్యాణ్ కు జోడీగా తమన్నా ?
గోపీచంద్ సాహస నిర్ణయం
ప్రతీకారం కోరుకుంటే ఎదుగుదల ఉండదు..!
రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా వుండడన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఫేస్బుక్లో మాత్రమే ఉండేది. అది కూడా ఏదో నామ మాత్రం అన్నట్టుగానే ఉండేవాడు. ఇక ఇటీవలే ట్విట్టర్లోకి అడుగు పెట్టాడు. ట్విట్టర్ కూడా అదే పరిస్థితి. చాలా రేర్ గా అప్ డేట్స్ ఇస్తుంటాడు. అయితే చరణ్ తాజాగా చేసిన ట్వీట్ మాత్రం వైరల్ అవ్వడమే కాకుండా ఆలోచింపచేస్తుంది. ఇంతకీ చరణ్ పెట్టిన ట్వీట్ ఏంటంటే.. ‘‘హింస లేదా అహింస.. మార్గం ఏదైనా, ప్రతీకారం కోరుకుంటే మనం ఉన్న చోట స్తంభించిపోతాం తప్ప ఎదుగుదల ఉండదు.’’ అని రామ్ చరణ్ ట్వీట్ చేసి ఆయన నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలోని ఓ స్టిల్‌ను, మరో క్లోజప్ స్టిల్‌ను పోస్ట్ చేశారు…
ఈ రూమర్స్ ఎలా వస్తాయో అర్థంకావట్లేదు..!
మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. ఇక ఈ సినిమా తర్వాత "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ సినిమాలు పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. ఒక మంచి హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తుంది ఈ భామ.
స్క్రిప్ట్ లో ఆ రెండు పాయింట్స్ కచ్చితంగా చూసుకుంటా..!
అతి తక్కువ టైంలోనే రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఏదిగింది. అయితే ఆ రేంజ్ కు ఎదగాలంటే కేవలం లక్ ఒక్కటే వుంటే సరిపోదు కదా. ఏ కథను ఎంచుకుంటున్నారు.. వాారి కథకు ఎంత ప్రాధాన్యత వుంది అనే విషయాలు కూడా చూసుకోవాలి. ఏదో నాలుగు సీన్స్, నాలుగు పాటలు ఉన్నాయా అని చూసుకుంటే సరిపోదు కదా. అలా చూసుకుంటే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగడం కష్టం. ఆ విషయంలో రష్మిక మాత్రం డిఫరెంట్ అనే చెప్పొచ్చు. మొదటి సినిమా నుండి తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ కథలను ఎంపిక చేసుకోవడం వల్లే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉంది. ఛలో, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ ఏ సినిమాకి ఆ సినిమాలో తన…
గల్వాన్ వ్యాలీ నేపథ్యంలో బాలీవుడ్ మూవీ
భారత్ , చైనాల సరిహద్దు గల్వాన్ వ్యాలీ లో ఘర్షణలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. అక్కడ జరిగిన ఘర్షణ లో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. చైనాకు వ్యతిరేక పోరాటంలో ప్రధాని మోదీ 59 చైనా యాప్ లను నిషేధించారు. చైనా వస్తువులను బహిష్కరించమని ప్రజలకు పిలుపునిచ్చారు. గల్వాన్ వ్యాలీ నేపథ్యంలో మలయాళ భాష లో ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో మూవీ బాలీవుడ్ లో రూపొందనుంది.
ఎన్టీఆర్ సాంగ్ కు జపనీస్ జంట డ్యాన్స్ అదుర్స్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అశోక్ " మూవీ 2006 సంవత్సరంలో రిలీజ్ అయ్యి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. సమీరారెడ్డి కథానాయిక. మణిశర్మ సంగీతం అందించారు. ఎన్టీఆర్ , సమీరా రెడ్డి సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అనుకున్నారు.
"12'O Clock" మూవీ టీజర్ రిలీజ్
దెయ్యం , భూత్ , డర్నా మనా హై , డర్నాజరూరీ హై , అగ్యాత్ , భూత్ రిటర్న్స్ , ఐస్ క్రీమ్ వంటి హారర్ మూవీస్ తో ప్రేక్షకులను భయపెట్టిన రామ్ గోపాల్ వర్మ మరో హారర్ మూవీతో ప్రేక్షకులముందుకు వస్తున్నారు. కరోనా టైమ్ లో కూడా వర్మ డేరింగ్ గా షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ రూపొందిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. కరోనా మహమ్మారి పై రూపొందిందించిన "కరోనా వైరస్ "మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
మరో మూవీ లో సంగీత దర్శకుడు
"బంపర్ ఆఫర్ ", "అహ నా పెళ్ళంట ", "దేవుడు చేసిన మనుషులు ", "దొంగాట ", "పలాస 1978 " వంటి మూవీస్ కు సంగీత దర్శకుడిగా పని చేసిన రఘు కుంచె "పలాస 1978 " మూవీ లో నటుడిగా గుర్తింపు పొందారు. యాక్టర్ ,సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ , మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇప్పుడు మరో మూవీ కి నటుడిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నెపోటిజంపై తాప్సీ స్పందన
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పాత్ర కు ప్రాధాన్యం ఉండే మూవీస్ ను తాప్సీ ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం "హసీన్ దిల్ రుబా ", క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ "శభాష్ మిథు " హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. జనగణమన {తమిళ ) మూవీ లో కూడా నటిస్తున్నారు.
లాక్ డౌన్ సమయం లో రామ్ చరణ్
మూవీ షూటింగ్స్ , ఓపెనింగ్స్ , ప్రమోషన్స్ , ఫొటో షూట్స్ తో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీస్ కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి మూడు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు. తమ తమ వ్యాపకాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. షూటింగ్స్ కు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినా స్టార్ హీరో , హీరోయిన్స్ షూటింగ్స్ లో పాల్గొనడానికి ఆసక్తి కనపరచడం లేదు.
"ఇండియన్ 2" మూవీ లో పాయల్ స్పెషల్ సాంగ్ ?
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా "ఇండియన్ 2" తమిళ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "ఇండియన్ "(భారతీయుడు ") మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ కథానాయికలు. సిద్ధార్ధ్ , బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

"#NTR30" మూవీలో విలన్ గా మనోజ్ మంచు ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ లో కొమరం భీం గా నటిస్తున్నారు." RRR" మూవీ తరువాత ఎన్టీఆర్ "#NTR30" మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో "#NTR30" మూవీ తెరకెక్కనుంది.
అభిమానులకు మహేష్ బాబు థ్యాంక్స్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి మహేష్ బాబు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం ప్రారంభంలోనే "సరిలేరు నీకెవ్వరు " వంటి బ్లాక్ బస్టర్ మూవీ కలెక్షన్స్ తో మహేష్ బాబు రికార్డ్స్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు మహేష్ బాబు , అభిమానులకు అనేక జాగ్రత్తలు చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
ఆ వార్తల్లో నిజం లేదు - ఆర్ జి వి
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా కాలంలో కూడా షార్ట్ ఫిల్మ్స్ , మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. " క్లైమాక్స్ ", "నేకెడ్ " వంటి ఫిల్మ్స్ ను ప్రత్యేకమైన యాప్ తో "పే ఫర్ వ్యూ " విధానంలో ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. కరోనా మహమ్మారి పై "కరోనా వైరస్ " పేరుతో ఒక మూవీ ని రూపొందించారు. "పవర్ స్టార్ " టైటిల్ తో ఒక మూవీ ని తెరకెక్కిస్తున్నారు. "12 "o " క్లాక్ " టైటిల్ తో ఒక హారర్ మూవీ ని వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
''12 O క్లాక్'' ట్రైలర్ రిలీజ్..!
కరోనా రాకముందు కూడా వర్మ ఇంత స్పీడ్ గా సినిమాలు చేసింది లేదు. ఒకపక్క అందరూ షూటింగ్ లు తీయాలన్నా.. షూటింగ్ లకు వెళ్లాలన్నా భయపడుతున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తూ అందరికీ షాకులిస్తున్నాడు. ఇప్పటికే ''క్లైమాక్స్'', 'నేకెడ్', 'మర్డర్', 'కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్', 'ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ' సినిమాలు లైన్ లో ఉండగా ఈ రోజు ''12 O క్లాక్'' అనే హారర్ మూవీని తీస్తున్నట్టు ప్రకటించాడు. అంతేనా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడైందో తెలియదు కానీ అప్పుడే ట్రయిలర్ కూడా రిలీజ్ చేసాడు.
రేణు దేశాయ్ గ్రీన్ ఛాలెంజ్ - ఛాలెంజ్ కాదు అందరూ ముందుకు రావాలి..!
టీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చాలా మంది ఇప్పటికే సెలెబ్రిటీస్ పాల్గొన్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను రేణు దేశాయ్ కూడా పూర్తి చేసింది. సంతోష్‌కుమార్ ప్రారంభించిన 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి రేణు దేశాయ్ జూబ్లీహిల్స్ లోని పార్కులో తన కూతురితో మొక్కలు నాటించి గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసింది.
దర్శకుడు రాజమౌళి పై తమన్నా ప్రశంసలు
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెలుగు , తమిళ భాషలలో రెండు భాగాలుగా రూపొందిన ఎపిక్ యాక్షన్ మూవీ "బాహుబలి "ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి , ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ దర్శకుడు రాజమౌళి తో పాటు ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

''12 O క్లాక్'' తో భయపెడతా అంటున్న వర్మ..!
హార్రర్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. ఒకప్పుడు 'రాత్రి' 'భూత్' సినిమాలతో ఆడియన్స్ ని భయపెట్టాడు. ఇక ఈ మధ్య కాలంలో వర్మ హార్రర్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. వర్మ నుండి హార్రర్ సినిమా వచ్చి చాలా ఏళ్ళే అయింది. ఇప్ప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి హార్రర్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ ద్వారా ''12 O క్లాక్'' అనే హారర్ మూవీని తీస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ రోజు సాయంత్రం 7 గంటలకి 12 'O' క్లాక్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించనున్నారు.
నిహారిక ఎంగేజ్ మెంట్ డేట్ అప్పుడే..?
మెగా కాంపౌండ్ లో కూడా త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నిహారికకు కాబోయే వరుడిని అందరికీ పరిచయం చేశారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నట్టుగా తెలుస్తోంది. గుంటూరుకు చెందిన ఓ పోలీస్ అధికారి కొడుకు చైతన్య. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి నిశ్చితార్దానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆగస్ట్ 13న చైతన్య, నిహారిక ల నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆగస్టులో ఎంగెజ్మెంట్, వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
పవన్ కళ్యాణ్ కు జోడీగా తమన్నా ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కోర్ట్ రూమ్ డ్రామా గా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ " మూవీ కి తెలుగు రీమేక్ గా దిల్ రాజు నిర్మిస్తున్న"వకీల్ సాబ్ " మూవీ కి బోనీ కపూర్ సహనిర్మాత. అంజలి , నివేత థామస్, అనసూయ , అనన్య నాగళ్ళ , ప్రకాష్ రాజ్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
గోపీచంద్ సాహస నిర్ణయం
యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీమార్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా "సీటీమార్ " మూవీ షూటింగ్ నిలిచిపోయింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై తేజ దర్శకత్వంలో రూపొందనున్న "అలిమేలు వెంకట రమణ " మూవీ కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.