“#NTR30” మూవీలో విలన్ గా మనోజ్ మంచు ?

Tollywood Actor Manchu Manoj To Play Antagonist Role In NTR 30 Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో కొమరం భీం గా నటిస్తున్నారు.” RRR” మూవీ తరువాత ఎన్టీఆర్ “#NTR30” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#NTR30” మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#NTR30” మూవీ లో విలన్ పాత్రకు ప్రాధాన్యం ఉండటం తో మంచు మనోజ్ ను ఆ క్యారెక్టర్ కు ఎంపిక చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ తన మూవీస్ లో యంగ్ హీరోలను ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ ఆఫర్ చేసి, వారిని ఎంకరేజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మనోజ్ మంచు ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “అహం బ్రహ్మస్మి ” మూవీ లో నటిస్తూ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన “అరవింద సమేత వీర రాఘవ ” మూవీ ఘనవిజయం సాధించడంతో “#NTR30” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.