ఆ వార్తల్లో నిజం లేదు – ఆర్ జి వి

There is no truth in the news saying i have stopped shooting my movies due to corona virus says director ram gopal varma

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా కాలంలో కూడా షార్ట్ ఫిల్మ్స్ , మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ” క్లైమాక్స్ “, “నేకెడ్ ” వంటి ఫిల్మ్స్ ను ప్రత్యేకమైన యాప్ తో “పే ఫర్ వ్యూ ” విధానంలో ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. కరోనా మహమ్మారి పై “కరోనా వైరస్ ” పేరుతో ఒక మూవీ ని రూపొందించారు. “పవర్ స్టార్ ” టైటిల్ తో ఒక మూవీ ని తెరకెక్కిస్తున్నారు. “12 “o ” క్లాక్ ” టైటిల్ తో ఒక హారర్ మూవీ ని వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

చిత్ర యూనిట్ లో ఒకరికి కరోనా సోకడంతో షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై వర్మ స్పందించారు. టీమ్ మెంబర్స్ లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చి షూటింగ్ నిలిచిపోయిందనే వార్తలు నిజం కాదని , మేము ప్రతీ ఒక్కరం కరోనా టెస్ట్ చేయించుకునే షూటింగ్ లో పాల్గొంటున్నామని , టెస్ట్ లలో అందరికి నెగటివ్ వచ్చిందని , కరోనా జాగ్రత్తలు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నామని వర్మ ట్వీట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here