కరోనా రాకముందు కూడా వర్మ ఇంత స్పీడ్ గా సినిమాలు చేసింది లేదు. ఒకపక్క అందరూ షూటింగ్ లు తీయాలన్నా.. షూటింగ్ లకు వెళ్లాలన్నా భయపడుతున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తూ అందరికీ షాకులిస్తున్నాడు. ఇప్పటికే ”క్లైమాక్స్”, ‘నేకెడ్’, ‘మర్డర్’, ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’, ‘ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ’ సినిమాలు లైన్ లో ఉండగా ఈ రోజు ”12 O క్లాక్” అనే హారర్ మూవీని తీస్తున్నట్టు ప్రకటించాడు. అంతేనా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడైందో తెలియదు కానీ అప్పుడే ట్రయిలర్ కూడా రిలీజ్ చేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి హార్రర్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. ఒకప్పుడు ‘రాత్రి’ ‘భూత్’ సినిమాలతో ఆడియన్స్ ని భయపెట్టాడు. ఇక ఈ మధ్య కాలంలో వర్మ హార్రర్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. వర్మ నుండి హార్రర్ సినిమా వచ్చి చాలా ఏళ్ళే అయింది. ఇప్ప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి హార్రర్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నాడు. మరి ఈ సినిమాతో ఎంత భయపెడతాడో చూద్దాం. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించనున్నారు.
12 ‘o’ CLOCK is a highly performance driven film by Makrand Deshpande, Mithun Chakraborthy, Manav Kaul ,Dilip Tahil ,Ali Azhgar,Ashish Vidyardhi and new comer Krishna Gautam
Cinematography Amol Rathod .. Music @mmkeeravani https://t.co/3CJbV20aGB pic.twitter.com/VBcVyqyvPx— Ram Gopal Varma (@RGVzoomin) July 3, 2020




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























