దెయ్యం , భూత్ , డర్నా మనా హై , డర్నాజరూరీ హై , అగ్యాత్ , భూత్ రిటర్న్స్ , ఐస్ క్రీమ్ వంటి హారర్ మూవీస్ తో ప్రేక్షకులను భయపెట్టిన రామ్ గోపాల్ వర్మ మరో హారర్ మూవీతో ప్రేక్షకులముందుకు వస్తున్నారు. కరోనా టైమ్ లో కూడా వర్మ డేరింగ్ గా షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ రూపొందిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. కరోనా మహమ్మారి పై రూపొందిందించిన “కరోనా వైరస్ “మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
A కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో హారర్ మూవీ “12’O Clock” రూపొందింది. చిత్ర యూనిట్ “12’O Clock” మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది. టీజర్ లోని విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ “12’O Clock” మూవీ పై ఆసక్తిని రేకెత్తించాయి. ఈ మూవీ కి MM కీరవాణి సంగీతం అందించడం విశేషం. టీజర్ తోనే ప్రేక్షకులను భయపెట్టిన వర్మ మొత్తం సినిమా తో ప్రేక్షకులను మరింత భయపెట్టే అవకాశం ఉంది. పూర్తి సినిమా చూసిన ప్రేక్షకుల పరిస్థితి ఏమిటో ?
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: