ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 9

న్యూ ఇయర్ కి 'మాస్టర్' ట్రైలర్..?

చారిత్రాత్మక ప్రేమ కథ లో రాశీఖన్నా ?
మహాసముద్రం షూటింగ్ స్టార్ట్

అమ్మ చీర - @32 ఏళ్లు
విశాఖ సాగర తీరాన ఎస్విఆర్ కాంస్య విగ్రహం
మరో తెలుగు మూవీ లో నేహాశెట్టి
క్లైమాక్స్ లో కె.జి.యఫ్ 2 - అధీరా వర్సెస్ రాఖీ

"రౌద్రం రణం రుధిరం" సెట్స్ లో అలియా భట్
"క్రాక్" గోవా షెడ్యూల్ పూర్తి
క్రాక్ సెట్ లో సూపర్ ఫన్ - ప్లాంక్ చాలెంజ్
నితిన్ 'అంధాధున్' రీమేక్ షూటింగ్ మొదలు
పెళ్ళికూతురు తో చిరు సెల్ఫీ
నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
బెస్ట్ ఫొటో సెలెక్ట్ చేయడం కష్టమే
రాశీఖన్నా స్టన్నింగ్ లుక్
రేసు గుర్రం బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
నాగశౌర్య మూవీ కి క్యాచీ టైటిల్
IIT కృష్ణమూర్తి ట్రైలర్ రిలీజ్
బిగ్ బాస్ 4 - హౌస్ మేట్స్ కే 'అధికారం' ఇచ్చిన బిగ్ బాస్
బిగ్ బాస్ - 13 వ వారం అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోయాడు. ఇంక 14వ వారంలోకి అడుగుపెట్టారు. సండే ఫండే సంగతి పక్కన పెడితే అందరూ వెయిట్ చేసేది మాత్రం మండే అది కూడా నామినేషన్స్ ప్రక్రియ కోసం. కాస్త ఈ ఎపిసోడే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హౌస్ మేట్స్ వాదనలతో హౌస్ మొత్తం హీట్ అవుతుంది.

న్యూ ఇయర్ కి 'మాస్టర్' ట్రైలర్..?
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులు ఎంత వెయిట్ చేస్తున్నారో.. తెలుగు అభిమానులు కూడా అంతే ఆకస్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇక ఇటీవల సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

చారిత్రాత్మక ప్రేమ కథ లో రాశీఖన్నా ?
టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల రాశీఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. రాశీఖన్నా 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ఇప్పుడు ఒక చారిత్రాత్మక ప్రేమ కథ తో తెరకెక్కనున్న తెలుగు మూవీ లో కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.
మహాసముద్రం షూటింగ్ స్టార్ట్
శర్వానంద్ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో రేంజ్ అందుకున్న సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అమ్మ చీర - @32 ఏళ్లు
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్ళిసందడి మొదలైంది. గత వారం రోజుల నుండే మెగా ఫ్యామిలీ అంత ఒకేచోట పార్టీలతో హంగామా చేస్తున్నారు. ఇక మిగిలిన పరివారమంతా ఉదయపూర్ చేరుకొనే పనిలో వున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ముహూర్తం ఉండటంతో.. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జోరుగా జరుగుతున్నాయి. మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలతో తెగ సందడి చేస్తున్నారు. అందుకు సంబంధించి పలు ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కూడా. నిహారికని పెళ్లి కూతురు చేసే కార్యక్రమంకి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్…
విశాఖ సాగర తీరాన ఎస్విఆర్ కాంస్య విగ్రహం
ఏ జానర్ మూవీలో నైనా తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎస్ వి రంగారావు ప్రేక్షక హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. దుర్యోధన , రావణ , యమధర్మ రాజు , భీష్ముడు , ఘటోత్కజుడు , హిరణ్య కశ్యపుడు , కీచకుడు , కంసుడు , నరకాసురుడు వంటి పౌరాణిక పాత్రలతో పాటు , సాంఘిక చిత్రాలలో హృదయాలను బరువెక్కించే అనేక పాత్రలను అవలీలగా పోషించి ఎస్విఆర్ ప్రేక్షకులను అలరించారు. తెలుగు తో తమిళ భాషలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మరో తెలుగు మూవీ లో నేహాశెట్టి
మిస్ మంగుళూరు గా టైటిల్ అందుకున్న మోడల్ నేహా శెట్టి బ్లాక్ బస్టర్ "ముంగారు మలే2 "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన "మెహబూబా " మూవీ తో నేహా శెట్టి కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ లో ఒక కీలక పాత్రకు నేహా శెట్టి ఎంపిక అయ్యారు.
సింగర్ సునీతతో మ్యాంగో మాస్ మీడియా అధినేత నిశ్చితార్ధం
సునీత ఉపద్రష్ట.. పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సునీత వైవాహిక జీవితం గురించి కూడా అందరికీ తెలిసిందే . చాలా చిన్న వయసులోనే కిరణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా వ్యక్తిగత కారణాల వల్ల తన భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు సునీత. ఇక తనకు ఇద్దరు పిల్లలు ఉండగా.. వారితోనే ఉంటుంది సునీత.
క్లైమాక్స్ లో కె.జి.యఫ్ 2 - అధీరా వర్సెస్ రాఖీ
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అంతేకాదు షూటింగ్ చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది. హైద్రాబాద్ లో క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. క్లైమాక్స్ లో ఉన్నాం.. అధీరా వర్సెస్ రాఖీ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఫైట్ మాస్టర్ అన్బు, అరివు నేతృత్వంలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను…

"రౌద్రం రణం రుధిరం" సెట్స్ లో అలియా భట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "రౌద్రం రణం రుధిరం " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ , సీనియర్ హీరోయిన్ శ్రియ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
"క్రాక్" గోవా షెడ్యూల్ పూర్తి
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో రవి తేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. కరోనా కారణంగా నిలిచిపోయిన "క్రాక్ "మూవీ షూటింగ్ అక్టోబర్ నెలలో పునః ప్రారంభం అయ్యింది.
క్రాక్ సెట్ లో సూపర్ ఫన్ - ప్లాంక్ చాలెంజ్
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత శృతీ మళ్ళీ క్రాక్ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా ఇటీవలే షూట్ కోసం గోవా కూడా వెళ్లారు అయితే అక్కడ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా శృతీ హాసన్ తాజాగా తన ఇన్స్టాలో చిన్న వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ క్రాక్ సినిమా షూట్ గురించి చెప్పుకొచ్చింది.
నితిన్ 'అంధాధున్' రీమేక్ షూటింగ్ మొదలు
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు యంగ్ హీరో నితిన్ మాములుగా లేదు. ఒక పక్క ఒక సినిమా చేస్తూనే మరోపక్క మరో సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసేసాడు. ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ కోసమే ఇటీవలే దుబాయ్ వెళ్ళింది చిత్ర బృందం. ఇక అక్కడే నితిన్ 30వ సినిమా కూడా మొదలుపెట్టాడు.
పెళ్ళికూతురు తో చిరు సెల్ఫీ
మెగా స్టార్ చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు తనయ నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్య తో డిసెంబర్ 9 వ తేదీ రాజస్థాన్ లోని ఉదయ పూర్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుక, కరోనా కారణంగా పరిమిత బంధు మిత్రుల సమక్షంలో జరగనుంది. డిసెంబర్ 11 వ తేదీ రిసెప్షన్ ను నాగేంద్ర బాబు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరపనున్నారు. నాగేంద్ర బాబు ఇంటిలో పెళ్ళిసందడి మొదలయ్యింది. పెళ్ళి కూతురు ను చేసే వేడుకలో 32 సంవత్సరాల క్రితం తన తల్లి పద్మజ నిశ్చితార్థ వేడుకలో ధరించిన శారీ ను నిహారిక ధరించి పెళ్ళికూతురు గా అందంగా కనిపించారు.
నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారికకు గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు చైతన్యకు ఆగస్ట్ 13న నిశ్చితార్దం జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి జరగనుంది. ఇక ఇప్పటికే మెగా పరివారం అంతా దాదాపు అక్కడికి చేరిపోయింది. ఒకరిద్దరు మరో రెండు రోజుల్లో అక్కడికి చేరుకోనున్నారు. మరోవైపు పెళ్లి సందడి కూడా మొదలైంది.
బెస్ట్ ఫొటో సెలెక్ట్ చేయడం కష్టమే
వయసు పెరుగుతున్న కొద్ది కొంతమంది మొహం లో తేడాలు క్లియర్ గా కనిపిస్తాయి. కానీ టాలీవుడ్ రాజకుమారుడు అని ఏ ముహూర్తాన పేరు తెచుకున్నాడో కానీ ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. అంతేకాదు మహేష్ విషయంలో వయసు పెరగడం అనేది రివర్స్. వయసు పెరిగే కొద్ది మహేష్ మాత్రం ఇంకా చిన్నగా అయిపోతున్నాడు. ఇప్పటికే ఎన్నో ఫొటోస్ లో అది మనకు అర్ధమైనా.. ఇప్పుడు మహేష్ పోస్ట్ చేసిన ఫొటోతో అది మరోసారి రుజువైంది.
రాశీఖన్నా స్టన్నింగ్ లుక్
టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల రాశీఖన్నా సూపర్ హిట్ "ఇమైక్క నోడిగళ్" మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించారు. "అడంగమారు ", "అయోగ్య " మూవీస్ తో రాశీఖన్నా తమిళ ప్రేక్షకులను అలరించారు . రాశీఖన్నా ప్రస్తుతం తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. "అరణ్మణై 3", "తుగ్లక్ దర్బార్ ", "మేధావి" , "సైతాన్ కా బచ్చా "తమిళ మూవీస్ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రేసు గుర్రం బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ‘కిక్’ శ్యామ్ అన్నదమ్ములుగా నటించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాలను.. వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి. శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. సలోని, తనికెళ్ళ భరణి, పవిత్ర లోకేష్, ప్రకాష్ రాజ్, ప్రగతి, రవికిషన్, ముకేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణ మురళి, ఎం.యస్.నారాయణ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ…
నాగశౌర్య మూవీ కి క్యాచీ టైటిల్
లాక్ డౌన్ సమయంలో హీరో నాగశౌర్య వర్కౌట్స్ తో 8ప్యాక్ అబ్స్ సాధించడం తోపాటు పలు స్క్రిప్ట్స్ విని కొన్ని స్క్రిప్ట్స్ ను ఓకే చేశారు. నాగశౌర్య ప్రస్తుతం 3 సినిమాలలో నటిస్తున్నారు. సోనాలీ నారంగ్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర్ సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య "మూవీ రూపొందుతుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూ వర్మ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "వరుడు కావలెను "మూవీ తెరకెక్కుతుంది.
IIT కృష్ణమూర్తి ట్రైలర్ రిలీజ్
శ్రీ వర్ధన్ దర్శకత్వంలో పృథ్వి దండమూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా IIT కృష్ణమూర్తి. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.