క్లైమాక్స్ లో కె.జి.యఫ్ 2 – అధీరా వర్సెస్ రాఖీ

Climax Fight Shoot Of KGF2 Movie,KGF Chapter 2, Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, KGF Chapter 2 climax shoot Begins,Yash KGF Chapter 2,Anbariv shoots for KGF,Director Prashanth Neel,KGF Chapter 2 Climax,KGF 2 Climax Shooting,KGF 2 Climax Fight,Rocky Adheera Climax Fight

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అంతేకాదు షూటింగ్ చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది. హైద్రాబాద్ లో క్లైమాక్స్‌ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. క్లైమాక్స్ లో ఉన్నాం.. అధీరా వర్సెస్ రాఖీ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఫైట్‌ మాస్టర్‌ అన్బు, అరివు నేతృత్వంలో ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు యష్ పుట్టిన రోజు అంటే జనవరి 8న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మరి థియేటర్స్ ఎలాగూ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూద్దాం.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 13 =