లాక్ డౌన్ సమయంలో హీరో నాగశౌర్య వర్కౌట్స్ తో 8ప్యాక్ అబ్స్ సాధించడం తోపాటు పలు స్క్రిప్ట్స్ విని కొన్ని స్క్రిప్ట్స్ ను ఓకే చేశారు. నాగశౌర్య ప్రస్తుతం 3 సినిమాలలో నటిస్తున్నారు. సోనాలీ నారంగ్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర్ సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య “మూవీ రూపొందుతుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూ వర్మ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “వరుడు కావలెను “మూవీ తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందనున్న మూవీ పూజా కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో న్యూజిల్యాండ్ సింగర్ షిర్లీ సేతియా కథానాయిక. అద్భుతమైన టైటిల్స్ ఎంపిక చేసుకుంటున్న నాగశౌర్య ,లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి “శ్రీ కృష్ణ సత్య భామ “టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ టైటిల్ క్యాచీ గా ఉండి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది. హీరో నాగశౌర్య ఈ మూడు మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























