మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారికకు గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు చైతన్యకు ఆగస్ట్ 13న నిశ్చితార్దం జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి జరగనుంది. ఇక ఇప్పటికే మెగా పరివారం అంతా దాదాపు అక్కడికి చేరిపోయింది. ఒకరిద్దరు మరో రెండు రోజుల్లో అక్కడికి చేరుకోనున్నారు. మరోవైపు పెళ్లి సందడి కూడా మొదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా మరో నాలుగు రోజులు ఉండటంతో ప్రీ వెడ్డింగ్ పనులు మొదలయ్యాయి. మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలతో తెగ సందడి చేస్తున్నారు. అందుకు సంబంధించి పలు ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కూడా. నిహారికని పెళ్లి కూతురు చేసే కార్యక్రమంకి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి.
ఇక నిశితార్థం రోజున ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. ఇక ఇప్పుడు పెళ్లికి కూడా ఇరుకుంటుంబ సభ్యులు వారికి అత్యంత సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన కొద్దిమంది ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుకకు నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్టు టాక్. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి సినీ ఇండస్ట్రీ నుంచి కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నారని.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసి టాలీవుడ్ మొత్తానికి ఆహ్వానించనున్నారని తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: