ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 10
"కెజిఎఫ్ చాప్టర్ 2"మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
'అమ్మ' వర్ధంతి - 'తలైవి' నుండి స్పెషల్ పిక్స్
తిమ్మరుసు ఫస్ట్ లుక్ రిలీజ్ - టీజర్ కు డేట్ ఫిక్స్
జాంబిరెడ్డి టీజర్ రిలీజ్ - రాక్షసం మనుష్య రూపేనా
పవర్ ఫుల్ టైటిల్ తో బాలకృష్ణ
అనసూయ కోలీవుడ్ ఎంట్రీ
ఈవారం టాలీవుడ్ లేటెస్ట్ అప్ డేట్స్

సలార్ కోసం అందుకే ప్రభాస్ ను తీసుకున్నా

ఒరేయ్ బుజ్జిగా - మళ్లీ థియేటర్ రిలీజ్
కొత్త కోణం లో "ఆదిపురుష్"
నిహారిక 'పెళ్లి సందడి మొదలు'
స్టార్ ఇమేజ్ కోరుకోలేదు - శ్రియ
హాలీవుడ్ రేంజ్ లో "ఆదిపురుష్ "

ఎప్పుడూ చూడని ప్రభాస్ ను చూస్తారు
'ఆర్ఆర్ఆర్' - మహాబలేశ్వర్ లో కొత్త షెడ్యూల్
కొన్ని ఫొటోలను అందరితో పంచుకోవాలి
"ఆచార్య" మూవీలో రష్మిక
తెలుగు , కన్నడ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , కన్నడ , తమిళ భాషలలో పలు ఆఫర్స్ అందుకుంటున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందనున్న "ఆడాళ్ళూ మీకు జోహార్లు "మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. ఇప్పుడు రష్మిక మరో భారీ తెలుగు మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
"కెజిఎఫ్ చాప్టర్ 2"మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ "కెజిఎఫ్ చాప్టర్ 1 " కన్నడ మూవీ సీక్వెల్ "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
'అమ్మ' వర్ధంతి - 'తలైవి' నుండి స్పెషల్ పిక్స్
కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ కూడా పూర్తికానుంది.
తిమ్మరుసు ఫస్ట్ లుక్ రిలీజ్ - టీజర్ కు డేట్ ఫిక్స్
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈ సినిమా రీమేక్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
జాంబిరెడ్డి టీజర్ రిలీజ్ - రాక్షసం మనుష్య రూపేనా
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'జాంబిరెడ్డి'. బాల నటుడిగా పరిచయమైన తేజా సజ్జా ఈ సినిమాతో హీరోగా మారబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లకూ, మోషన్ పోస్టర్‌కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేసింది. ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ వర్క్ మొదలైనట్టు తెలుస్తుంది.
పవర్ ఫుల్ టైటిల్ తో బాలకృష్ణ
"తాతమ్మ కల "(1974 ) మూవీ తో కెరీర్ ప్రారంభించిన బాలకృష్ణ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ కు పెట్టింది పేరైన బాలకృష్ణ "నరసింహ నాయుడు ", "సింహా ", శ్రీరామ రాజ్యం ', "గౌతమి పుత్ర శాతకర్ణి ", "మువ్వగోపాలుడు ","ఆదిత్య 369"వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న "BB3 " మూవీ లో నటిస్తున్నారు.
అనసూయ కోలీవుడ్ ఎంట్రీ
అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అనసూయ సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే. "క్షణం ", "రంగస్థలం ", "యాత్ర ", "కథనం "వంటి మూవీస్ తో అనసూయ ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "రంగస్థలం "మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
ఈవారం టాలీవుడ్ లేటెస్ట్ అప్ డేట్స్
విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ఒరేయ్.. బుజ్జిగా’. ఈ సినిమాను ఆహా లో అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ చేశారు. థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఓటీటీ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ థియేటర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం థియేటర్స్ తెరచుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేటర్‌లలో కూడా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని జనవరి 1న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
బిగ్ బాస్ 4 - ఫినాలే టికెట్ గెలుచుకున్న అఖిల్
బిగ్ బాస్ 4 - 'రేస్ టు ఫినాలే' టాస్క్ గత నాలుగు రోజుల నుండి జరుగుతూనే ఉంది. ఫైనల్లీ ఈ రోజు ఈ టాస్క్ ముగిసింది. మరి నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగింది.. ఎవరు ఫినాలే టికెట్ ను సొంతం చేసుకున్నారు అన్నది తెలియాలంటే ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే. మూడో టాస్క్ లో భాగంగా దాదాపు ఒక రోజు మొత్తం ఉయ్యాలలోనే వున్నారు అఖిల్, సోహెల్. ఉదయం అయినా పట్టు వదలకుండా ఉయ్యాలలోనే ఉండిపోయారు. ఇక ఇద్దరిలో ఎవరూ దిగట్లేదని ఇద్దరూ ఆలోచించుకోండి అని అభి సలహా ఇచ్చాడు.

సలార్ కోసం అందుకే ప్రభాస్ ను తీసుకున్నా
ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఇక ఇది సెట్స్‌లో ఉండగానే ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాకి, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ తో మరో సినిమాను లైన్ లో పెట్టాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి ‘సలార్’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఒరేయ్ బుజ్జిగా - మళ్లీ థియేటర్ రిలీజ్
విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా 'ఒరేయ్.. బుజ్జిగా'. ఈ సినిమాను ఆహా లో అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ చేశారు. థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఓటీటీ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ థియేటర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం థియేటర్స్ తెరచుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేటర్‌లలో కూడా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది.
కొత్త కోణం లో "ఆదిపురుష్"
టి - సిరీస్ ఫిల్మ్స్ , రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మైథలాజికల్ మూవీ 3D ఫార్మాట్ లో తెలుగు , హిందీ భాషలలో రూపొందనున్న "ఆదిపురుష్ "మూవీ షూటింగ్ జనవరి లో ప్రారంభం కానుంది. 2022 సంవత్సరంలో ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేశారు. సీతగా కృతిసనన్ , లంకాధిపతిగా సైఫ్ అలీఖాన్ ఎంపిక అయ్యారు. బడ్జెట్ కు వెరవకుండా "ఆదిపురుష్ "మూవీని హాలీవుడ్ రేంజ్ లో దర్శకుడు తెరకెక్కించనున్నారు. హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్ పర్ట్స్ ఈ మూవీ కి పని చేయనున్నారు.

బిగ్ బాస్ - 'A' ఎవరో క్లారిటీ ఇచ్చిన అభి
బిగ్ బాస్ 4 - షో ఎండింగ్ కు వస్తుండేసరికి బిగ్ బాస్ కు కూడా ఏం చేయాలో తెలియట్లేదనుకుండా.. రోజురోజుకి బోరింగ్ గా సాగుతుంది తప్పా.. ఎక్సైట్ మెంట్ మాత్రం ప్రేక్షకుల్లో తగ్గిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాత్రి ఎపిసోడ్ కూడా కాస్త బోరింగ్ గానే అయిపోయింది.
నిహారిక 'పెళ్లి సందడి మొదలు'
మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారికకు గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు చైతన్యకు ఆగస్ట్ 13న నిశ్చితార్దం జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి జరగనుంది.
స్టార్ ఇమేజ్ కోరుకోలేదు - శ్రియ
"ఇష్టం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రియ "సంతోషం "మూవీ తో విజయం సాధించారు. దక్షిణాది భాషల తోపాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు స్టార్ హీరోలు , తమిళ స్టార్ హీరోల మూవీస్ లో నటించి శ్రియ ప్రేక్షకులను అలరించారు. శ్రియ ప్రధాన పాత్రలో రూపొందిన "గమనం "మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. "రౌద్రం రణం రుధిరం ", "సండ క్కారి "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.
హాలీవుడ్ రేంజ్ లో "ఆదిపురుష్ "
టి - సిరీస్ ఫిల్మ్స్ , రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందనున్న మైథలాజికల్ మూవీ "ఆది పురుష్ "మూవీ ఆగస్ట్ 11, 2022 సంవత్సరం లో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రాముడిగా ప్రభాస్ , సీత గా కృతి సనన్ , లంకాధిపతి గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. జనవరి నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న "ఆది పురుష్ "మూవీ కన్నడ , తమిళ , మలయాళ భాషలతో పాటు పలు ఫారిన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది.

ఎప్పుడూ చూడని ప్రభాస్ ను చూస్తారు
మొత్తానికి ప్రభాస్ మంచి జోరు మీద ఉన్నాడుగా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అది కూడా చిన్నా చితకా సినిమాలు కాదు పాన్ ఇండియా లెవల్ సినిమాలే. దర్శక నిర్మాతలు కూడా ప్రభాస్ తో ఆ రేంజ్ సినిమాలు తీయడానికే ఇష్టపడుతున్నారు.
'ఆర్ఆర్ఆర్' - మహాబలేశ్వర్ లో కొత్త షెడ్యూల్
ఆర్ఆర్ఆర్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ బిజీగా షూట్ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి. అసలే లేట్ అవ్వగా కరోనా వల్ల మరింత లేట్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూట్ ను మళ్లీ మొదలు పెట్టగా రాజమౌళి మాత్రం ఇక ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితమే దాదాపు 50రోజుల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసి కంప్లీట్ చేశారు.
కొన్ని ఫొటోలను అందరితో పంచుకోవాలి
పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై.. ఇక అదే సినిమాలో హీరోగా నటించిన పవన్ ను ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్ కమ్ డైరెక్టర్ రేణు దేశాయ్. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమయ్యారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. విడిపోయినా కూడా రేణు పవన్ అప్పుడప్పుడు కలుసుకుంటూనే వుంటారు. ముఖ్యంగా పిల్లలు కోసం పవన్ కూడా స్పెషల్ గా వారి దగ్గరకు వెళ్లిన సందర్భాలు వున్నాయి. అంతేకాదు రేణు కూడా పవన్, తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది.
"మోసగాళ్ళు "మూవీ లో నవీన్ చంద్ర ఫస్ట్ లుక్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎవిఎ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో బిగ్గెస్ట్ ఐటి స్కామ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనలతో క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు "మూవీ రూపొందింది. భారీ బడ్జెట్ , అత్యుత్తమ టెక్ని కల్ వాల్యూస్ తో తెరకెక్కిన "మోసగాళ్ళు "మూవీ లో సునీల్ శెట్టి , నవదీప్ , నవీన్ చంద్ర ,రూహిసింగ్ ముఖ్య పాత్రలలో నటించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు.