శ్రీ వర్ధన్ దర్శకత్వంలో పృథ్వి దండమూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా IIT కృష్ణమూర్తి. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. హరీశ్ శంకర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఐఐటి కృష్ణ మూర్తి కచ్ఛితంగా ప్రక్షకుల్ని అలరిస్తోందని ట్వీట్ లో పేర్కొన్నారు.
Happy to launch the trailer of #IITKrishnamurthy. This looks very promising & intriguing. Best wishes to the entire team.#IITKrishnamurthyOnPrime Premieres on Dec 10, @PrimeVideoIN@_SREEVARDHAN #Naresh Kumaran #MangoMassMediahttps://t.co/W7V3cM0JWb
— Harish Shankar .S (@harish2you) December 5, 2020
ఇక ట్రయిలర్ ను చూస్తుంటే… కృష్ణమూర్తి కనిపించకుండా పోయిన తన బాబాయిని వెతికే క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలను ఈ ట్రైలర్ లో చూపించారు. తన బాబాయ్ డెత్ మిస్టరీని ఛేదించే క్రమంలో హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేది ఇందులో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తం మీద ‘ఐఐటీ కృష్ణమూర్తి’ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉంది.
కాగా క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్, అక్కి ఆర్ట్స్ బ్యానర్లు పై మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ప్రసాద్ నెకురి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మైరాదోషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా సత్య, వినయ్ వర్మ, బెనర్జీ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నరేశ్ కుమారన్ సంగీతాన్ని అందిస్తుండగా.. అక్కి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























