బిగ్ బాస్ 4 – హౌస్ మేట్స్ కే ‘అధికారం’ ఇచ్చిన బిగ్ బాస్

#BiggBossTelugu4, Akkineni Nagarjuna, BB House, Big Boss 4, bigg boss, Bigg Boss 4, Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Telugu Day 89, Bigg Boss 4 Telugu Day 89 Highlights, Bigg Boss 4 Telugu Nominations, Bigg Boss 4 Telugu Nominations List, Bigg Boss Akhil Wins Finale Ticket, Bigg Boss Telugu 4, Bigg Boss Telugu Season 4, Bigg Boss Telugu Season 4 Latest News, Everyone Except Akhil Nominated In The Last Task Of The Season, Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

బిగ్ బాస్ – 13 వ వారం అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోయాడు. ఇంక 14వ వారంలోకి అడుగుపెట్టారు. సండే ఫండే సంగతి పక్కన పెడితే అందరూ వెయిట్ చేసేది మాత్రం మండే అది కూడా నామినేషన్స్ ప్రక్రియ కోసం. కాస్త ఈ ఎపిసోడే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హౌస్ మేట్స్ వాదనలతో హౌస్ మొత్తం హీట్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే ఆ మండే ఉండే నామినేషన్ల హీట్ ఈ ఎపిసోడ్ లో మిస్ అయ్యారు ఆడియన్స్. ఇంకా వుంది రెండు వారాలే కాబట్టి ఈ వీక్ అందరూనామినేషన్ లోకి వచ్చేసారు. ఇక బిగ్‌బాస్ హౌస్ మేట్స్ కు రాజారాణి టాస్కు ఇచ్చాడు. మిమ్మ‌ల్ని మీరు నిరూపించుకోండంటూ ‘అధికారం’ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో రాజు, రాణి అయ్యేవాళ్లు బిగ్‌బాస్ రూల్స్‌ను మార్చుతూ సొంత నియ‌మాలు పెట్టొచ్చని చెప్పాడు. అఖిల్ ఎలాగూ నామినేషన్ లో లేడు కాబట్టి మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తాడని చెప్పాడు బిగ్ బాస్. ఇక మొదట బజర్ మోగగానే కిరీటాన్ని అందుకుని సోహైల్ రాజు అయ్యాడు. ఇక తన రాజ్యంలో అందరికంటే ఎక్కువగా అరియానానే టార్గెట్ చేశాడు. వెంటనే అక్కడ ఉన్న పాత్రలు తోమమని చెప్తాడు. మంత్రితో మ‌సాజ్ చేయించుకున్నాడు. హారిక‌తో ఫ్రూట్స్ తినిపించుకున్నాడు. మరో వైపు అరియానా ముఖాన ట‌మాట‌లు రుద్దాడు. ఒకరకంగా చెప్పాలంటే సోహెల్ అరియానాను ఏడిపించాలని అనుకుంటే అరియానానే సోహెల్ ను ఏడిపించింది. ఆమె జింతాత జింతాత స్టెప్పులు వేయడంతో త‌న‌కు ఫ్యూచ‌ర్ క‌నిపిస్తుంద‌ని సోహైల్ భ‌య‌ప‌డ్డాడు. ఇంత‌లో బజర్ మోగడంతో సోహైల్ గ‌డువు ముగిసింది. దీంతో అత‌డు త‌న కిరీటాన్ని అభిజిత్‌కు అప్ప‌గించాడు.

ఇక అభిజిత్ ను ఎక్కువ సేపు చూపించలేదని చెప్పొచ్చు. హారిక మాట‌కు ముందోసారి, చివ‌రోసారి ఇకిలి పికిలి అనే ప‌దాన్ని ఉప‌యోగించాల‌ని అభిజిత్‌ హారికను ఆదేశించాడు. త‌ర్వాత మోనాల్ పాట పాడ‌గా దానికి సోహైల్‌, అరియానా రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత బజర్ మోగడంతో అభి గడువు ముగిసింది. ఆ తర్వాత అరియానాకు ఇవ్వొద్దని సోహెల్ అభిని బతిమిలాడాడు. దానితో అభి హారికకు తర్వాత ఛాన్స్ ఇచ్చాడు.

అనంత‌రం మ‌హారాణిగా మారిన హారిక‌.. త‌ను చెప్పిన‌వి చేయ‌క‌పోతే బ‌ట్ట‌లు స్విమ్మింగ్ పూల్‌లో ప‌డేస్తాన‌ని హెచ్చ‌రించింది. దీంతో అంత ప‌ని చేయొద్దంటూ ఆమెను కూల్ చేసేందుకు సోహైల్ ముద్దు పెట్టాడు. అక్క‌డే ఉన్న‌ అఖిల్ నాకు కూడా పెట్టాల్సిందేన‌ని ప‌ట్టుప‌డ్డాడు. రాణి కాలం ముగిశాక పెడ్తాన‌ని చెప్పి హారిక తప్పించుకుంది.

ఇక అభిజిత్ కూడా హారిక‌ను పొగిడిన‌ట్లే పొగిడి ఇదంతా అబ‌ద్ధ‌మ‌ని చెప్పడంతో కోపంతో హారిక అభి బ‌ట్ట‌ల‌ను స్విమ్మింగ్ పూల్‌లో ప‌డేసింది. త‌ర్వాత‌ పువ్వుతో నాన్‌స్టాప్‌గా ప్ర‌పోజ్ చేయాల‌ని సోహైల్‌ను ఆదేశించింది. ఇది చాలా ఈజీ అని అఖిల్ చెప్ప‌డంతో హారిక మ‌రో టాస్క్ ఇచ్చింది. లోపలి వెళ్లి షూ వేసుకొని రావాలని అది కూడా 15 సెక‌న్ల‌లో చేయాలని ఆదేశించింది. దీంతో సోహైల్ కు కోపం వచ్చింది. అసలే కోపంతో ఉండగా రెండు షూల లేస్‌ను క‌లిపి క‌ట్టుకొని డ్యాన్స్ చేయాలంది. అక్కడ డాన్స్ చేశాడు.. అయితే లోపలి వచ్చిన తర్వాత మరింత కోపంతో చైర్ లు కూడా కిందపడేశాడు. ఇక అభి సోహెల్ ను కాస్త కూల్ చేసాడు. నేను రాజుగా ఉన్న‌ప్పుడు ఒక్క ప‌ని చేయ‌లేదు కానీ ఆమె రాణిగా ఉన్న‌ప్పుడు మాత్రం అన్ని ప‌నులు చేస్తున్నాడ‌ని అఖిల్ మీద మండిప‌డ్డాడు. ఇదిలా ఉండగానే మరోవైపు అరియానాతో డాన్స్ చేయించింది. అఖిల్ పాట‌ పాడుతుండగా అరియానా డ్యాన్స్ చేసింది. ఒక రకంగా హారిక రాజ్యం గొడ‌వ‌ల‌తోనే ముగిసింది. ఇంకా మోనాల్‌, అరియానా మిగిలారు.. రేపు రాణులుగా వాళ్లు ఎలా చేస్తారో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =