కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 8

సినిమా వార్తలు

ఘనంగా జరిగిన నిహారిక పెళ్లి

ఫైనల్ గా కుమారి నిహారిక కాస్త శ్రీమతి నిహారిక అయిపోయింది. గత నాలుగు రోజులుగా మెగా డాటర్ నిహారిక సందడి చూస్తూనే ఉన్నాం.. సోషల్ మీడియాలో పెళ్లికి సంబందించిన ఫొటోలు కూడా చాలా వైరల్ అవుతూనే ఉన్నాయి. జైపూర్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్ లో ఈరోజు సాయంత్రం 7 గంటలకు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య నిహారికలో మెడలో మూడు ముళ్లు వేసాడు.

TFN Adminవాట్సాప్
#BiggBossTelugu4, Akkineni Nagarjuna, BB House, Big Boss 4, Bigg Boss, Bigg Boss 4, Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Telugu Nominations List, Bigg Boss Telugu 4, Bigg Boss Telugu 4 Day 94, Bigg Boss Telugu 4 Day 94 Highlights, Bigg Boss Telugu Season
బిగ్ బాస్

బిగ్ బాస్ 4.. సోహెల్ - అరియానా బిగ్ ఫైట్

బిగ్ బాస్ - 4... షో ముగింపు దశకు వచ్చేసరికి హౌస్ లో హీట్ కూడా అదే రకంగా పెరుగుతుంది. నిన్న మోనాల్-అరియానా మధ్య వివాదం రాగా ఈరోజు సోహెల్-అరియానా మధ్య గొడవతో ఈరోజు మాత్రం బిగ్ బాస్ టాప్ లేచిపోయింది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ర‌వితేజ 'ఖిలాడి'

రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా... ఫస్ట్‌లుక్‌లో రవితేజ హుషారుగా కనిపిస్తూ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సి కళ్యాణ్ బ్యానర్ లో బాలకృష్ణ మరో మూవీ

హీరో బాలకృష్ణ వరస మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత ఒక కొత్త దర్శకుడితో ఒక మూవీ కి , సక్సెస్ ఫుల్ "కందిరీగ "మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న "బలరామయ్య బరిలో దిగితే " మూవీ కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"పెళ్ళిసందD " లో ప్రత్యేక పాత్రలో శ్రీకాంత్ ?

కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "పెళ్ళిసందడి " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవళి , దీప్తి భట్నాగర్ కథానాయికలు. కీరవాణి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని "పెళ్ళిసందడి " మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తో శ్రీకాంత్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. క్లీన్ ఎంటర్ టైనర్ గా "పెళ్ళిసందడి " మూవీని తెరకెక్కించి దర్శకుడు రాఘవేంద్ర రావు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 25 సంవత్సరాల తరువాత "పెళ్ళిసందడి " మూవీ సీక్వెల్ తెరకెక్కనుంది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'తిమ్మరుసు' టీజర్ రిలీజ్

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. . ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేసింది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఈ రోజు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. కాగా ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై నిర్మాత సృజన్‌ ఎరబోలు ‘తిమ్మరుసు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

TFN Adminవాట్సాప్
Actor Satyadev Latest Movie Thimmarasu Teaser Is Out, Anasuya upcoming film, Latest Tollywood News, Satyadev Fights For Justice Shines Bright, Satyadev Latest Movie, Satyadev Latest Movie Thimmarasu Teaser Is Out, Satyadev New Movie Thimmarusu, Satya
సినిమా వార్తలు

హీరో వైష్ణవ్ తేజ్ స్మార్ట్ లుక్

హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ "ఉప్పెన " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం కానున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా రూపొందిన "ఉప్పెన " మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించారు. భారీఅంచనాలు ఉన్న "ఉప్పెన " మూవీ కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

డర్టీ హరి- ట్రైలర్ 2.0 రిలీజ్

ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు. ఇప్పుడు చాలా గ్యాప్ తో మరో సినిమాతో వస్తున్నాడు. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్న సినిమా ’డ‌ర్టీ హ‌రి‘. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని... విడుదలకు సిద్ధంగా ఉంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ట్రయిలర్ 2.0 పేరుతో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెగా సందడి

మెగా స్టార్ చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు తనయ నిహారిక , మాజీ ఐజి జొన్నలగడ్డ ప్రభాకరరావు తనయుడు చైతన్య ల వివాహం ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో ఈ రోజు (9 వ తేదీ ) జరగనున్న విషయం తెలిసిందే. 7 వ తేదీ ఆహ్వానితులు ప్రత్యేక విమానాలలో ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఉదయ్ పూర్ కు చేరుకున్న మెగా , అల్లు ఫ్యామిలీస్ సంగీత్ , మెహందీ కార్యక్రమాలలో సందడి చేశారు. తొలి రోజు జరిగిన సంగీత్ కార్యక్రమంలో మెగా హీరోలు డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు. వధూ వరులు కూడా డ్యాన్స్ లలో పాల్గొన్నారు.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - హౌస్ మేట్స్ 'ఓపిక' కు పరీక్ష

బిగ్ బాస్ 4 - మొన్న జరిగిన రాజు రాణి టాస్క్ నిన్న కూడా కొనసాగింది. మొన్న సోహెల్, అభి, హారిక వంతు అయిపోగా.. రాత్రి ఎపిసోడ్ లో అరియానా, మోనాల్ రాణులుగా రూలింగ్ చేశారు. మీకు న‌చ్చిన వ‌స్తువు తీసుకొచ్చి, దానికి సంబంధించిన జ్ఞాప‌కాన్ని పంచుకోవాల‌ని ఆదేశించింది అరియానా. అలాగే దాన్ని ఇంట్లో న‌చ్చిన‌వాళ్ల‌కు ఇవ్వాల‌ని చెప్పింది. దీంతో సోహైల్ త‌న గుర్తుగా అభిజిత్‌కు స‌స్పెండ‌ర్‌, హారిక‌కు క‌త్తి, మోనాల్‌కు టీ ష‌ర్ట్‌, అరియానాకు ప‌ర్ఫ్యూమ్‌, అఖిల్‌కు జాకెట్‌ను ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఛలో ఉదయపూర్ - నిహారిక పెళ్లికి పవన్ పయనం

నాగబాబు ముద్దుల కుమార్తె నిహారికపెళ్లి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ‌ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా అక్కడకు చేరుకుంది. మెగా హీరోలంతా సందడి చేస్తున్నారు. సంగీత్ కార్యక్రమంలో భాగంగా చిరుతో సహా రామ్‌చరణ్, అల్లు అర్జున్,‌ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా అందరూ కూడా చిందులేశారు. అయితే ఇప్పటివరకూ ఉన్న లోటు మాత్రం ఒక్కటే బాబాయ్ కళ్యాణ్ ఇంకా వెళ్ళకపోవడం. ఒక్క పవన్‌ కల్యాణ్‌ తప్పా మిగిలిన మెగా, అల్లు ఫ్యామిలీస్.. సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' ఖాతాలో మరో రికార్డ్ - మోస్ట్ ట్వీటెడ్ మూవీ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసిన సంగతి విదితమే. బుల్లి తెరపై కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయినా కూడా ఇప్పటికీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సూపర్ స్టార్ మమ్ముట్టి రికార్డ్

దక్షిణాది భాషల తోపాటు హిందీ , ఇంగ్లీష్ భాషల చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ మమ్ముట్టి మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా 3 నేషనల్ , 7 కేరళ స్టేట్ అవార్డ్స్ మమ్ముట్టి అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మమ్ముట్టి ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మమ్ముట్టి ప్రస్తుతం "ది ప్రీస్ట్ ", "వన్ " మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"ఫైటర్ "మూవీ అప్ డేట్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ "మూవీ తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ముంబై లో 40 రోజుల షూటింగ్ షెడ్యూల్ జరుపుకున్న "ఫైటర్ "మూవీ మరో షెడ్యూల్ ముంబై లో జరుపుకోవాల్సి ఉంది. కరోనా కారణంగా మూవీ షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నిహా పెళ్లిలో చెర్రీ సందడి

కొణిదెల నాగబాబు ముద్దుల కుమార్తె నిహారికపెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాయి. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్ లో‌ ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఒక్క పవన్‌ కల్యాణ్‌ తప్పా మిగిలిన మెగా, అల్లు ఫ్యామిలీస్.. సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు. ఈ రోజు పవన్‌ వేడుకలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి రాజస్తాన్‌లో సంగీత్ వేడుక నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో కొణిదెల, అల్లు వారి ఫ్యామిలీ స‌భ్యులు అంతా ఉత్సాహంగా పాల్గొని చిందులు వేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పాయల్ రాజ్ పుత్ ట్రెడిషినల్ లుక్

సూపర్ హిట్ "RX 100 " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. "డిస్కో రాజా ", "వెంకీ మామ" మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. " అనగనగా అతిథి "మూవీ లో డీ గ్లామర్ పాత్రలో అద్భుతంగా నటించి పాయల్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. పంజాబీ భాషలో కూడా నటిస్తున్న పాయల్ ప్రస్తుతం "నరేంద్ర "(తెలుగు ), "ఏంజెల్ "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'సితార' కు 'అలియా' స్పెషల్ గిఫ్ట్

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం బాలీవుడ్ భామ హైదరాబాద్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక వస్తూ వస్తూ మహేష్ గారాలపట్టి సితారకు ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది. త‌న సొంత బ్రాండ్ దుస్తులు ప్ర‌త్యేకంగా తీసుకొచ్చి ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సితార పాప తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. త‌న సొంత బ్రాండ్ దుస్తులు సితార‌కి ఇవ్వగా వాటిని చూసి సంతోషంతో ఈ డ్రెస్ తనకెంతో న‌చ్చిందని సితార ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నూతన దంపతులకు చిరు శుభాకాంక్షలు

గత నాలుగైదు రోజుల నుండి మెగా వారసురాలు నిహారిక పెళ్లితో మెగా ఇంట సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌.. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి డిసెంబర్‌ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది. ఇప్పటికే మెగా పరివారమంతా అక్కడికి చేరుకున్నారు. మెహందీ.. సంగీత్ కార్యక్రమాలతో అందరూ ఫుల్ హంగామాలో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Actor Prabhas, Director Radha Krishna, Hero Prabhas, Latest Tollywood News, Prabhas, Radhe Shyam, Radhe Shyam Film, Radhe Shyam Movie, Radhe Shyam Movie Latest Updates, Radhe Shyam Movie Shoot, Radhe Shyam Movie Shoot News, Radhe Shyam Movie Shoot up
షూటింగ్ అప్‌డేట్

'రాధే శ్యామ్' - 1000 మంది.. 100 రోజులు

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది అసలే కరోనా వల్ల అనుకున్న టైం కంటే ఎక్కువ ఆలస్యం అవ్వడంతోబ్రేక్ లేకుండా షూటింగ్ ను పూర్తి చేసేపనిలో పడ్డారు. అలా ఇటలీలో షూటింగ్ ను పూర్తి చేసుకొని వచ్చారో లేదో.. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వెంటనే మరో షెడ్యూల్ ను స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన అప్ డేట్స్ కూడా రాధా కృష్ణ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శృతి హాసన్ ఫీలింగ్స్

మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై వాస్తవ సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ షూటింగ్ గోవా షెడ్యూల్ తో కంప్లీట్ అయ్యింది. వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ హిట్ "బలుపు "మూవీ తరువాత శృతి హాసన్ , "క్రాక్ "మూవీ లో నటించారు.ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత శృతి తన ఫీలింగ్స్ ను వెల్లడించారు.

Team TFNవాట్సాప్

షేర్