శర్వానంద్ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో రేంజ్ అందుకున్న సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలు షూటింగ్ లను మొదలు పెట్టగా.. ఫైనల్లీ మహాసముద్రం సినిమా కూడా పట్టాలెక్కింది. ఈ రోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. ఈ సందర్భంగా అజయ్ భూపతి తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియచేసారు..ఈ లవ్ స్టోరీని అసాధారణ క్యారెక్టరైజేషన్స్‌తో కూడిన ఇంటెన్స్ డ్రామాను చూపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇలాంటిది మీరెప్పుడూ అనుభవించి ఉండరు! మీరంతా తప్పకుండా ఈ మూవీ ఇష్టపడతారు. ఈ రోజు షూటింగ్ స్టార్ట్ చేశామని తెలిపాడు.
I can’t wait to show you this fierce love story, an intense drama with phenomenal characterizations! Something you’ve never experienced before! I’m sure you’ll ❤️ it.
Excited to start the shoot today 🔥#MahaSamudram 🌊#MahaSamudramBegins ❤️ @ImSharwanand @Actor_Siddharth pic.twitter.com/EbR3iUazRY— Ajay Bhupathi (@DirAjayBhupathi) December 7, 2020
ఇంకా ఈ సినిమాలో అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. .
కాగా అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సన్సేషన్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 సినిమాతోనే పెద్ద సక్సెస్ కొట్టాడు అరుణ్ భూపతి. లవ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సొంత చేసుకుంది. మరి ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: