మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్ళిసందడి మొదలైంది. గత వారం రోజుల నుండే మెగా ఫ్యామిలీ అంత ఒకేచోట పార్టీలతో హంగామా చేస్తున్నారు. ఇక మిగిలిన పరివారమంతా ఉదయపూర్ చేరుకొనే పనిలో వున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ముహూర్తం ఉండటంతో.. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జోరుగా జరుగుతున్నాయి. మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలతో తెగ సందడి చేస్తున్నారు. అందుకు సంబంధించి పలు ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కూడా. నిహారికని పెళ్లి కూతురు చేసే కార్యక్రమంకి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా నిహారిక ఒక ఫొటోను తన ఇన్‌స్టా లో పోస్ట్ చేయగా అది కూడా నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. అదేంటంటే.. తన తల్లి పద్మ 32 సంవత్సరాల క్రితం తన నిశ్చితార్దానికి కట్టుకున్న చీరని ఇప్పుడు మళ్లీ తను కట్టుకొని.. తన తల్లి ఫొటో, తన ఫొటో పక్కపక్కన పెట్టి.. ఈ ఫొటోని నిహారిక షేర్ చేసింది. దానికి ”మా అమ్మ నిశ్చితార్థం చీర.. 32 సంవత్సరాలు..” అంటూ కామెంట్ పెట్టింది.
View this post on Instagram
కాగా గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు చైతన్యకు ఆగస్ట్ 13న నిశ్చితార్దం జరిగిన సంగతి తెలిసిందే. ఇండియన్ స్కూల్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేసిన చైతన్య ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























