క్రాక్ సెట్ లో సూపర్ ఫన్ – ప్లాంక్ చాలెంజ్

Ravi Teja Shares A Fun Workout Video,Fun Workout Video From The Sets Of Krack Movie,Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Actress Shruti Haasan,Shruti Haasan Upcoming Movie Krack,Krack Telugu Movie Updates,Shruti Haasan New Movie Krack

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత శృతీ మళ్ళీ క్రాక్ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా ఇటీవలే షూట్ కోసం గోవా కూడా వెళ్లారు అయితే అక్కడ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా శృతీ హాసన్ తాజాగా తన ఇన్స్టాలో చిన్న వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ క్రాక్ సినిమా షూట్ గురించి చెప్పుకొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ వీడియోలో రవితేజ, శ్రుతి హాసన్ ప్లాంక్ చాలెంజ్ చేస్తున్నట్టు కనిపించింది. దానితో పాటు క్రాక్ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఫన్ ఎంజాయ్ చేశాను.. నాలా నేను ఉన్నాను.. థ్యాంక్యూ రవితేజ నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చినందుకు.. అమేజింగ్ టీం.. డైరెక్టర్ గోపీచంద్ ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు.. సినిమాటోగ్రాఫర్ విష్ణు మ్యాజికల్ వర్క్.. నా కుటుంబంలాగ ఫీల్ అయ్యాను.. ఈ సంక్రాంతికి మీ అందమైన కుటుంబంతో కలిసి వెళ్లి సినిమా చుడండి అంటూ తన పోస్ట్ లో పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

కాగా మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూడో చిత్రం ‘క్రాక్‌’. ‘క్రాక్’ తో హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు వీరిద్దరు. య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతీ హాస‌న్ హీరోయిన్ గా నటిస్తుంది. స‌ముద్ర‌ఖనీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘మెర్సాల్‌’, ‘బిగిల్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ప‌నిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =