ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు యంగ్ హీరో నితిన్ మాములుగా లేదు. ఒక పక్క ఒక సినిమా చేస్తూనే మరోపక్క మరో సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసేసాడు. ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ కోసమే ఇటీవలే దుబాయ్ వెళ్ళింది చిత్ర బృందం. ఇక అక్కడే నితిన్ 30వ సినిమా కూడా మొదలుపెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ 30 సినిమాగా అంధాధున్ సినిమా రీమేక్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైంది. దుబాయ్ లో ఈ సినిమా షూట్ ను మొదలుపెట్టారు. నితిన్, నభా నటేష్‌పై దుబాయ్‌లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసిన నితిన్, సెట్స్ మీద నుంచి ఓ ఫొటోను సైతం షేర్ చేశారు. నితిన్ 30 వ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని.. ఒక ఫొటో కూడా పోస్ట్ చేశాడు.ఇక ఫొటోలో ఆయన షర్టుపై స్వెటర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ కనిపిస్తున్నాడు.
#Nithiin30 shoot starts!! @GandhiMerlapaka @tamannaahspeaks @NabhaNatesh #sagarmahati pic.twitter.com/HDRjnFpKQa
— nithiin (@actor_nithiin) December 6, 2020
View this post on Instagram
కాగా జనవరి నుంచి జరిగే తదుపరి షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు.. సాంకేతిక నిపుణుల వివరాలు తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: