సునీత ఉపద్రష్ట.. పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సునీత వైవాహిక జీవితం గురించి కూడా అందరికీ తెలిసిందే . చాలా చిన్న వయసులోనే కిరణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా వ్యక్తిగత కారణాల వల్ల తన భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు సునీత. ఇక తనకు ఇద్దరు పిల్లలు ఉండగా.. వారితోనే ఉంటుంది సునీత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా దాదాపు రెండేళ్ల క్రితమే సునీత మరో పెళ్ళి చేసుకోబోతున్నట్లు పలు వెబ్‌సైట్స్‌లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వార్తలపై సునీత కూడా స్పందించి.. నేను ఒక వేళ పెళ్ళి చేసుకుంటే.. మీ ఆశీస్సులతో మీకు తెలిసేలానే సంతోషంగా జరుగుతుంది. ప్రస్తుతానికి.. ఇటువంటిది ఏమీ లేదు. దయచేసి ఈ రూమర్స్ ఏమీ నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చారు.
ముందు చెప్పినట్టే ఇప్పుడు తాజాగా తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. మ్యాంగో మాస్ మీడియా అధినేత రామ్‌తో సోమవారం సునీత నిశ్చితార్థం జరిగింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సునీత తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా “ప్రతి తల్లిలాగానే నేను నా పిల్లలు లైఫ్‌లో సెటిల్ కావాలని ఆశించాను. అదే సమయంలో నేను జీవితంలో స్థిరపడాలనుకునే మంచి ఆలోచన ఉన్న పిలలతో నేను ఆశీర్వదించబడ్డాను. రామ్ నా జీవితంలో ఒక శ్రద్ధగల స్నేహితుడిగా, అద్భుతమైన భాగస్వామిగా ప్రవేశించాడు. . మేం ఇద్దరం అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నాం. నేను నా జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుతున్నాను. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు” అంటూ పోస్ట్ లో తెలిపారు.
View this post on Instagram
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: