బిగ్ బాస్ – 4… షో ముగింపు దశకు వచ్చేసరికి హౌస్ లో హీట్ కూడా అదే రకంగా పెరుగుతుంది. నిన్న మోనాల్-అరియానా మధ్య వివాదం రాగా ఈరోజు సోహెల్-అరియానా మధ్య గొడవతో ఈరోజు మాత్రం బిగ్ బాస్ టాప్ లేచిపోయింది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మొన్నటి ఎపిసోడే నిన్న కూడా కొనసాగింది. ఓపిక టాస్క్ లో అరియానా, మోనాల్ మొన్న అయిపోగా ఈరోజు సోహెల్ తో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఇక టాస్క్ లో సోహెల్ రోబోలా కూర్చోగా.. సోహైల్‌పై అరియానా ప్రశ్నల వర్షం కురిపించింది. తన బొమ్మను పాడు చేయాలనుకున్నావంటూ… చింటూను నీళ్లలో పడేసి ఎమోషన్‌తో ఆడుకున్నావంటూ.. టాస్క్ అయిపోగానే క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. ఇక ఎప్పుడైతే టాస్క్ అయిపోయిందో కిందకి దిగిన సోహెల్ అరియానాపై ఎటాక్ చేసాడని చెప్పొచ్చు. బనువ్వు టాస్క్ చేస్తే ఒప్పు, అదే టాస్క్ మేము చేస్తే తప్పా అని నిలదీశాడు. నువ్వు మోనాల్‌కు గుడ్డు కొట్టినప్పుడు ఏమీ అనిపించనిది, ఇప్పుడు నీ బొమ్మను పట్టుకుంటే వచ్చిందా? అని తిరిగి ప్రశ్నించాడు. ఇక ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి పెద్ద గొడవకే దారి తీసింది. మధ్యలో సోహెల్ పాత టాస్క్ ల గురించి తీయడం.. అవినాష్ గురించి తీయడంతో అరియానా కూడా రెచ్చిపోయి సోహెల్ తో గొడవకు దిగింది.
ఇదిలా ఉండగా ఒకవైపు సోహెల్-అరియానా గొడవ పడుతుండగా మరోవైపు హారిక తన టాస్క్ కొనసాగిస్తూనే ఉంది. ‘ఓపిక’ టాస్క్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకుండా కొంచం సేపు బానేఉండగా ఆ తర్వాత అభి నవ్వించడంతో నవ్వేసింది. ఆ తర్వాత అభి టర్న్ వచ్చింది. అభి అయితే పూర్తిగా విఫలమయ్యాడు. కానీ అందరినీ నవ్వించాడు. మొత్తానికి ఈ టాస్కులో ఒక్క ఎక్స్‌ప్రెషన్ ఇవ్వకుండా ఉండిపోయిన సోహైల్ గెలిచాడు. దీంతో అతడు ప్రేక్షకులతో మాట్లాడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. “18 సంవత్సరాలకే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ పదేళ్లు అవుతున్నా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ కప్పు కొట్టాలన్నదే నా లక్ష్యం. నా కోపం మీకు నచ్చకపోతే క్షమించండి. కానీ నేను మీ మనసుల్లో ఉండిపోవాలి” అని వీక్షకులకు సందేశమిచ్చాడు. ఇదే ఛాన్స్ అనుకోని అరియానా తో గొడవ గురించి కూడా చెప్పాడు. ఆమెతో జరిగిన గొడవను ఇక్కడితో వదిలేస్తానని స్పష్టం చేశాడు.
మరి రేపు బిగ్ బాస్ మరో టాస్క్ తో వచ్చేస్తున్నాడు. ఇది కూడా బాగ్ బాస్ కాటెస్టెంట్స్ సహనానికి కూడా పెద్ద పరీక్ష లాంటిదే. మరి చూద్దాం రేపు ఎవరు గెలుస్తారో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: